ఏడు కోటగోడల సెట్‌లో రుద్రమదేవి

0

Anushka latest stills15కాకతీయ సామాజ్ఞ్రి రుద్రమదేవి మహోజ్వల చరిత్రను వెండితెర దశ్యమానం చేస్తూ స్వీయనిర్మాణ దర్శకత్వంలో గుణశేఖర్ రూపొందిస్తున్న చిత్రం రుద్రమదేవి. అనుష్క టైటిల్ రోల్‌ని పోషిస్తోంది. ఈ చిత్రంలో గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కళా దర్శకుడు పద్మశ్రీ తోటతరణి సారథ్యంలో వేసిన ఏడు కోటగోడల సెట్‌లో అల్లు అర్జున్‌పై కీలక ఘట్టాల్ని చిత్రీకరిస్తున్నారు.

ఈ సందర్భంగా గుణశేఖర్ మాట్లాడుతూ ఈ సెట్‌లో అల్లు అర్జున్‌తో పాటు వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా 40 రోజుల పాటు ముఖ్య సన్నివేశాల్ని చిత్రీకరిస్తాం. ఈ షెడ్యూల్‌లో అల్లు అర్జున్‌తో పాటు అనుష్క, రానా, ప్రకాష్‌రాజ్, కష్ణంరాజు, హంసానందిని, కేథరిన్ ట్రెసా పాల్గొంటారు. ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ దాదాపుగా పూర్తవుతుంది. గోన గన్నారెడ్డి పాత్రకు అల్లు అర్జున్ అద్భుతంగా కుదిరారు. సినిమాలో ఆయన పాత్ర ప్రత్యేకాకర్షణగా వుంటుంది. డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. సుమన్, ప్రకాష్‌రాజ్, నిత్యామీనన్, ప్రభ, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్యమీనన్, ప్రసాదాదిత్య, అజయ్, వేణుమాధవ్, ఉత్తేజ్, వెన్నెల కిషోర్, శివాజీరాజా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఆర్ట్: పద్మశ్రీ తోట తరణి, కెమెరా: అజయ్‌విన్సెంట్, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, మాటలు: పరుచూరి బ్రదర్స్, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఫైట్స్: విజయ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె. రామ్‌గోపాల్, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: గుణశేఖర్.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

తార‌క్ స‌ర‌స‌న పూజా హెగ్దే
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న సినిమా త్వ‌ర‌లో సెట్స్ కు వెళ్ల‌నున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇందులో హీరోయిన్ ...
రాజ‌మండ్రిలో స‌మంత రైడింగ్
సమంత స్కూటీపై షికార్లు చేసేస్తోంది. ఎంజాయ్‌ చేయడం కోసం కాదు లేండి. ఆమె నటిస్తున్న చిత్రంలోని ఓ సన్నివేశం కోసం. సమంత కథానాయికగా ‘యూ టర్న్‌’ తె...
`సంత‌`తొలి షెడ్యూల్ పూర్తి
సూర్య భరత్ చంద్ర ,శ్రావ్యా రావు జంటగా శ్రీ సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి నిర్మిస్తొన్న చిత్రం "సంత". మట్టి మనుషుల ప్రేమక...
powered by RelatedPosts