ఎవరికి "తిక్కరేగుతుందో" ఏమిటో?

0

Santhosh Srinivas (14)మొదటి సినిమా “కందిరీగ” తోనే తన దర్శకత్వ ప్రతిభ ఘనంగా చాటుకుని,చిత్ర పరిశ్రమలో తన ఆగమనాన్ని గట్టిగా చాటుకున్న యువ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. “కందిరీగ” తో చక్కటి గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ శ్రీనివాస్, తొందరపడి సినిమాలు తీయాలని అనుకోవడం లేదు. తాను చేసే ప్రతీ సినిమా తనకి వచ్చిన గుర్తింపుని మరింతగా పెంచుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. అందుకే ఇన్నాళ్ళ తరువాత ఎన్టీఆర్ తో “రభస” చేయిస్తున్నాడు.

ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఆగష్టు 14న విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో సంతోష్ శ్రీనివాస్ తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టాడు. ఇప్పటికే స్క్రిప్ట్ పక్కాగా రెడీ చేసుకున్న సంతోష్ శ్రీనివాస్ ఆ సినిమాకి ‘తిక్కరేగితే’ అనే టైటిల్ ని ఖరారు చేసాడు. కానీ ఈ సినిమాలో నటించనున్న హీరో, హీరోయిన్ మరియు నిర్మాత ఫైనలైజ్ కావాల్సి ఉంది. ఈ విషయాలను ‘రభస’ రిలీజ్ తర్వాత అధికారికంగా అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

అయితే ఏ హీరోకి “తిక్కరేగేలా” చేస్తాడో శ్రీనివాస్ చూడాలి మరి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts