‘ఎవడే సుబ్రమణ్యం’ నానికి ‘స్టూడెంట్ నెం1’ కానుందా?

0

Yevade Subramanyamయంగ్ హీరోస్ లో తనదైన నటనతో డిఫరెంట్ స్టోరీ సెలక్షన్ తో తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న టాలెంటెడ్ హీరో నాని ప్రస్తుతం ఈ ఉగాది సందర్భంగా మార్చి 21న ‘ఎవడే సుబ్రమణ్యం’ అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమా విడుదల వెనుక ఓ ఆసక్తికరమైన అంశం దాగి ఉంది. స్వప్న సినిమా బ్యానర్ లో వచ్చిన ‘స్టూడెంట్ నెం.1’ చిత్రంతో ఎన్టీఆర్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అలాగే దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి టాప్ డైరెక్టర్ గా ఎదిగారు. అలాగే ఇప్పుడు విడుదలవుతున్న ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రం ఆడియో విడుదలైంది. సినిమా ఫస్ట్ లుక్, థియేట్రికల్ ట్రైలర్ కి విశేషమైన స్పందన వచ్చింది. రాధాన్ అందించిన ఈ ఆడియో టాప్ ఆల్బమ్ గా కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఎవరూ సినిమాని తెరకెక్కించలేని లోకేషన్స్ లో అనేక వ్యయప్రయాసలకోర్చి సినిమాని తెరకెక్కించారు. ఇవన్నీ సినిమాపై అంచనాలను పెంచాయి. సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిని ఎదురుచూస్తున్నారు. మరి ఈ ఉగాదికి వస్తోన్న ‘ఎవడే సుబ్రమణ్యం’ నానికి మరో ‘స్టూడెంట్ నెం.1’ అవుతుందా ..

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

నాగ్ అశ్విన్ చేతుల మీదుగా విడుదలైన అక్షర అహా నా పెళ్లంట కవర్ వీడియో సాంగ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి అందరి ప్రశంసలు అందుకున్న అక్షర గురించి ప్రత్యేక పరచయం అక్క...
Nela Ticket movie review
Nela Ticket Review: అమ్మ చేతి ముద్దపప్పు ఆవకాయ ఎంత బాగుంటుందో కదా. అమ్మ ప్రతి రొజూ అదే చేసినా ఆనందంగా తింటాం, ఎందుకు అంటే అది ముద్దపప్పు ఆవకాయ ...
‘ఆపరేషన్ 2019’ ట్రైలర్ లాంచ్
“గాంధీ కడుపున గాంధీ పుట్టడు, ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు, మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు.. ఎవరైనా సరే ప్రజల్లో నుంచే రావాలి వివిధ రూపా...
powered by RelatedPosts