ఎవడు కాంబినేషన్‌లో…

0

Sruthi Hassan latest pics (15)ఎవడు చిత్రంతో తొలిసారి జోడి కట్టారు రామ్‌చరణ్, శృతిహాసన్. ఈ చిత్రంలో ఇద్దరి మధ్య చక్కటి కెమిస్ట్రీ కుదిరింది. ఇక రామ్‌చరణ్ నటనతో పాటు శృతిహాసన్ గ్లామర్ తళుకులు చిత్ర విజయానికి ఎంతగానో తోడ్పడ్డాయి. ఈ సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ జంట కలయికలో మరో సినిమా తెరకెక్కనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. వివరాల్లోకి వెళితే…రామ్‌చరణ్ కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే.

యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కనున్న ఈ చిత్రంలో శృతిహాసన్ కథానాయికగా ఎంపికైనట్లు సమాచారం. ఇటీవలే శృతిహాసన్‌ను కలిసిన చిత్రబృందం ఆమెకు కథను విపిపించినట్లు, దీనికి ఆమె కూడా ఒకే చెప్పినట్లు తెలిసింది. శ్రీను వైట్ల శైలిలోనే వినోదం, యాక్షన్ అంశాల సమాహారంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్, శృతిహాసన్‌ల పాత్రలు కొత్తపంథాలో సాగుతాయని తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడికానున్నట్లు సమాచారం. ఇదిలావుండగా మెగా హీరోలతో శృతిహాసన్ చేసిన గబ్బర్‌సింగ్ ఎవడు రేసుగుర్రం చిత్రాలు చక్కటి విజయాల్ని సాధించాయి. దీంతో ఆమె మెగాహీరోల లక్కీనాయిక అని చిత్ర వర్గాల్లో వినిపిస్తోంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

సాహో కోసం మ‌రో బాలీవుడ్ స్టార్
ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `సాహో` కోసం చిత్ర ద‌ర్శ‌కుడు సుజీత్ ఏకంగా బాలీవుడ్ తారాతోర‌ణాన్ని రంగంలో కి దించేస్తున్నాడు. ఇప్ప‌టికే హీరో...
స్పైడ‌ర్ ఈవెంట్ కు రోబో కాబింనేష‌న్!
మ‌హేష్ క‌థానాయకుడిగా ఏ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `స్పైడ‌ర్‌` తెలుగు, త‌మిళంలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతున్న సంగతి తెలిసిందే...
పైసా వ‌సూల్ సాంగ్ టీజ‌ర్
`కన్ను కన్ను కలిశాయి.. ఎన్నో ఎన్నో తెలిశాయి` అంటూ సాగే వీడియో సాంగ్ ను విడుదల చేసింది పైసా వసూల్ చిత్రబృందం. నందమూరి బాలకృష్ణ, శ్రియ మధ్య సాగుత...
powered by RelatedPosts