ఎన్నో అవమానాలు పడ్డాను: అనుష్క

0

Anushka (29)“దూరం నుండి చూస్తే సినీ రంగం ప్రతి ఒక్కరికీ ఒక రంగుల కలలాగే కనిపిస్తుంది కానీ, ఇక్కడికి వచ్చి చూసినప్పుడే అసలు విషయం బోధపడుతుంది. ఇక్కడ ఎంత నొప్పి భారిచాలి.ఎన్ని అవమానాలు ఎదుర్కోవాలి..ఎంత ఓపికగా ఉండాలి అన్నది నాకు బాగా తెలుసు” అంటూ అనుష్క, సినీరంగంలో తనకి ఎదురైనా అనుభవాల గురించి మీడియాతో ఇలా పంచుకుంది.

‘పరిశ్రమ కేవలం కొంతమందిదే అనుకోవడం పొరపాటు. ప్రతిభ, అదృష్టం ఉన్నవాళ్లందరిదీనూ. టాలెంట్ ఉంటే మీరే స్టార్స్. కాకపోతే కాస్త ఓపిగ్గా వ్యవహరించాలి” అంటోంది అనుష్క. ప్రస్తుతం ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ చిత్రాలతో బిజీగా ఉంది. అనుష్క మాట్లాడుతూ ”రాగానే ఎవ్వరికీ ఎర్ర తివాచీ పరిచేయరు. అవమానాలూ ఎదురవుతాయి. వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ‘సూపర్’ సమయంలో నాకు కష్టాలేం తెలియలేదు. ఎందుకంటే సెట్లో అందరూ చిన్న పిల్లలా చూసుకొన్నారు.

నాగార్జున, పూరి జగన్నాథ్, సుప్రియ అందరూ విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆ తరవాత సినిమా నుంచి కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. ‘ఈ వాతావరణానికి నేను సరితూగుతానా? లేదా?’ అనే అనుమానం వచ్చింది. ఆ క్షణంలో తిరిగి వెళ్లిపోవాలనే నిర్ణయం తీసుకొంటే ఈపాటికి నన్నంతా మర్చిపోయేవారే. ప్రతి ఒక్కరికి ఇలాంటి పరిస్థితి ఎదురుకావచ్చు. అత్మస్త్థెర్యం కోల్పోకుండా ముందుకు వెళ్లినవాళ్లే విజయాలు సాధిస్తారు. అందుకు నేనే నిదర్శనం” అని చెప్పుకొచ్చింది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

"సత్య గ్యాంగ్" సాంగ్స్ సూపర్ అంటున్నారు!!
సాత్విక్ ఈశ్వర్ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్యాప...
స‌రిహ‌ద్దు సైనిక‌ల‌తో సూర్య వాలీబాల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయకుడిగా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో నా పేరు సూర్య చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిస...
అల్లు రామ‌లింగ‌య్య హోమియో కాలేజ్ కు మెగాస్టార్ కోటి రూపాయ‌లు విరాళం
మెగాస్టార్ చిరంజీవి చేసే సేవా కార్య‌క్ర‌మాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స‌హాయ‌మంటూ వెళ్లిన వారికి ఆయ‌న స‌హాయం ఎప్పుడూ అందుతూనే ఉంటుంది. తాజాగా ...
powered by RelatedPosts