ఎందుకు అనుకోలేదు?

0

రెహన్, శ్వేతా జాదవ్ జంటగా నటించిన చిత్రం ‘ఇంకా ఏమీ అనుకోలేదు’. అమోగ్ దేశపతి ప్రధాన పాత్ర పోషించారు. శ్రీకర్‌బాబు దర్శకత్వం వహించారు. నిమ్మల శ్రీనివాస్, నిమ్మల రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సెన్సార్‌కి సిద్ధమైన ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. హైదరాబాద్‌లో చిత్రబృందం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. దర్శకుడు మాట్లాడుతూ ”కుటుంబ నేపథ్యంలో సాగే సరదా చిత్రమిది. వినోదానికి ప్రాధాన్యముంది. ఎదుటి వ్యక్తులు నచ్చినా ఒక జంట ప్రేమలో పడాలని అనుకోదు. అది ఎందుకన్నది తెరపైనే చూడాలి. అతి తక్కువ సమయంలో పూర్తయిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తామ”న్నారు. ”ఇటీవల విడుదలైన పాటలకు చక్కటి స్పందన లభించింది. సినిమా కూడా అదే తరహాలో ఆదరణను దక్కించుకొంటుంద”నే నమ్మకాన్ని వ్యక్తం చేశారు నిర్మాత.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
అదరగొడుతున్న మాస్ మహారాజా రవితేజ "నేల టిక్కెట్టు" ట్రైలర్‌:
మాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడి ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, వెటకారపు డైలాగులు ఉంటాయి, మంచి ఎమోషన్...
powered by RelatedPosts