ఈ అమ్మడు కూడా నిర్మాతైపోతోంది

0

neha-dhupia-hairstyle11చూడబోతే బాలీవుడ్ హీరోయిన్‌లకి తమ ఫ్యూచర్ బాగా కనిపిస్తోందేమో? మరెన్నాళ్ళో తమ మెరుపులు బాలీవుడ్ లో మిగలవు అని అర్ధం చేసుకున్నట్టున్నారు. బహుశా,ఆ కారణంతోనే ఫేడ్ అవుట్ అయిపోతున్న సుందరాంగులంతా నటన కి అదనంగా మరో ఆదాయపు మార్గాన్ని ఎంచుకుంటునానరు. మొన్నటిదాకా పూజా భట్, జూహీ చావ్లా, ప్రీతీ జింటా, దియా మీర్జా.. లని నిర్మాతాలుగా మారడం మనం చూశాం. ఇప్పుడిక మరో నాయిక వంతు వచ్చినట్టుంది. “జూలీ” సినిమాతో బాలీవుడ్ ని, కుర్రకారుని షేక్ చేసిన అందాల ముద్దుగుమ్మ నేహా ధూపీయా కూడా త్వరలో నిర్మాతగా మారనుంది అని సమాచారం.

నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ చెప్పుకోదగ్గ చిత్రాలు చేసే అవకాశం రాలేదామెకు. ప్రస్తుతం ఒకటి, రెండు సినిమాలు చేస్తున్నారు. త్వరలో నిర్మాతగా మారాలనుకుంటున్నారామె. ‘‘నటన మాత్రం కాకుండా నాకేదైనా వ్యాపారం చేయాలనిపిస్తే, కచ్చితంగా నా దృష్టి నిర్మాణ రంగం పైనే ఉంటుంది. ఫిలిం మేకింగ్ అంటే నాకు చాలా ఆసక్తి. మంచి మంచి సినిమాలు నిర్మించాలన్నది నా లక్ష్యం’’ అని ఇటీవల ఓ సందర్భంలో నేహా పేర్కొన్నారు. ‘‘మీరు నిర్మించే చిత్రాల్లో మీరే నాయికగా నటిస్తారా?’’ అనే ప్రశ్న నేహా ముందుంచితే -‘‘ఆ విషయం గురించి ఇంకా ఆలోచించలేదు’’ అంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
powered by RelatedPosts