ఇవే "రభస" పాటలు

0

RABHASA (3)సంగీత దర్శకుడు తమన్ – నందమూరి యంగ్ టైగర్ జో: ఎన్టీఆర్ కాంబినేషన్ అంటేనే సూపర్ హిట్. వీరి కలయికలో లోగడ ‘బృందావనం’, ‘బాద్షా’, ‘రామయ్యా వస్తావయ్యా’ వంటి మ్యూజికల్ హిట్ మూవీస్ వచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇన్ని రోజులకీ వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమానె “రభస” . ఈ సినిమా ఆడియోపై అభిమానులలో అంచనాలు ఒక రేంజ్లో ఉన్నాయి. హట్రిక్ హిట్స్ తర్వాత ‘రాకాసి.. రాకాసి..’ అంటూ ఎన్టీఆర్ తన గళాన్ని వినిపించడమే కారణం. జూలై 27న ‘రభస’ ఆడియో విడుదల కార్యక్రమాన్ని అభిమానుల సమక్షంలో నిర్వహించనున్నారు.
‘రభస’లో మొత్తం ఆరు పాటలు ఉన్నాయి. అందులో థీమ్ సాంగ్ ఒకటి.
1) లాల్ సలాం..
2) సైయో.. సైయోరే..
3) చెలి నిచ్చెలి..
4) సరోజ సరోజ..
5) రాకాసి.. రాకాసి..
6) రభస థీమ్ సాంగ్..
ఎన్టీఆర్ సరసన సమంత, ప్రణిత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘కందిరీగ’ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు. బెల్లంకొండ సురేష్ నిర్మాత. ఎన్టీఆర్ నుండి అభిమానులు ఆశించే యాక్షన్ తో పాటు ఫుల్ కామెడీ ఈ చిత్రంలో ఉంటుందని దర్శకనిర్మాతలు చెప్పారు. సినిమా ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts