ఇప్పుడు పెడతా ఒక స్కూల్: వర్మ

0

RGVదేశంలోనే అత్యంత వివాదాస్పద దర్శకుడు, అంతే ప్రతిభావంతుడు,అంతే పొగరుబోతు…ఇలా ఒకటి రెండు కాదు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకి ఉన్న పేర్లు. వర్మ ఏది చేసినా అది ఐతే వివాదం అవుతుంది లేదా సంచలనం అవుతుంది. అలాంటి వర్మ దగ్గర శిష్యరికం చేశామని, వర్మ స్కూల్ నుండి వచ్చాం అని ఎంతో మంది యువ దర్శకులు తరుచూ చెప్పుకోవడం చూశాం. దాని గురించే వర్మ నిన్నబుధవారం సాయంత్రం జరిగిన “ఐస్క్రీమ్” విజయోత్సవ సభలో మాట్లాడుతూ ” ఇప్పటివరకూ చాలామంది వర్మ స్కూల్ నుంచి వచ్చాం అని అంటుంటారు. నాకు ఎలాంటి స్కూల్ లేదు. కానీ ఇక ముందు స్కూల్ ఆరంభించి సినిమా నిర్మాణం, కొత్త కొత్త టెక్నిక్స్ తదితర విషయాల గురించి చెప్పాలనుకుంటున్నాను” అని అన్నాడు.

ఇది నిజంగానే వర్మని పిచ్చిగా అభిమానించే వారికి , వర్మ క్రేజ్‌లో సినిమా ఇండస్ట్రీ కి వచ్చి దర్శకులం అయిపోదాం అని కలలు కనేవారికి శుభవార్త. వర్మ కనుక నిజంగానే అలా స్కూల్ పెట్టి, దగ్గరుండి దర్శకత్వ మెళకువలు నేర్పించడం అటూ జరిగితే, కచ్చితంగా ఎందరో ప్రతిభావంతులైన దర్శకులని భారతీయ చిత్ర పరిశ్రమకి వర్మ అందించినవాడు అవుతాడు అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

స‌రిహ‌ద్దు సైనిక‌ల‌తో సూర్య వాలీబాల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయకుడిగా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో నా పేరు సూర్య చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిస...
అల్లు రామ‌లింగ‌య్య హోమియో కాలేజ్ కు మెగాస్టార్ కోటి రూపాయ‌లు విరాళం
మెగాస్టార్ చిరంజీవి చేసే సేవా కార్య‌క్ర‌మాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స‌హాయ‌మంటూ వెళ్లిన వారికి ఆయ‌న స‌హాయం ఎప్పుడూ అందుతూనే ఉంటుంది. తాజాగా ...
`అ` తెచ్చిన అద్భుత అవ‌కాశం
`అ` హిట్ తో రెజీనా కు మంచి గుర్తింపు ద‌క్కింది. అందులో అమ్మ‌డి మేకోవ‌ర్ అంద‌ర్నీ విస్మ‌యానికి గురిచేసింది. స‌క్సెస్ అందుకుంది. అందుకే అ మ‌రో అద్భ...
powered by RelatedPosts