ఇప్పుడు 'ఆగడు' సినిమాలో

0

sruthi hassanవరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనూ కథానాయికలు ప్రత్యేక గీతాల్లో నర్తించడం బాలీవుడ్‌లో సాధారణమైన విషయం. ఇప్పుడు ఈ సంస్కృతి తెలుగు సినిమా పరిశ్రమలోనూ ఎక్కువవుతోంది. విజయాలతో వూపు మీదున్న భామలు పనిలోపనిగా ప్రత్యేక గీతంలో కనిపించేందుకు మక్కువ చూపుతున్నారు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమాలో తమన్నా ఆడిపాడిందని ఇటీవల వార్తలొచ్చాయి. ఇప్పుడు ‘ఆగడు’ సినిమాలో శ్రుతిహాసన్ ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడనుంది. ఈ విషయాన్ని ఆ చిత్ర సంగీత దర్శకుడు తమన్ ట్విట్టర్‌లో తెలిపాడు. మహేష్‌బాబు కథానాయకుడిగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తమన్నా కథానాయికగా చేస్తోంది. అనిల్ సుంకర, గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కథానాయికగా తన అందచందాలతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తున్న శ్రుతి ఇప్పుడు ప్రత్యేక గీతంలో ఇంకెన్ని హొయలు పోతుందో చూడాలి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 8th December 2017
[caption id="attachment_550514" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 8th December 2017[/caption]...
Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts