ఇప్పటికే కాజల్ ఎన్టీఆర్‌తో

0

Actress Nisha Agarwal Wedding Photos, Kajal Sister Nisha Agarwal Marriage Photos”పని.. పని.. పని.. జీవితమంతా ఇలాగే ఉంటే ఇక ఆనందం ఎక్కడుంటుంది. అందుకే చిత్రీకరణలో ఎంత బిజీగా ఉన్నా.. ఓ చల్లని సాయంత్రం అలా స్నేహితులతో బయటకు వెళ్లేందుకు ప్రాధాన్యమిస్తాను. వాళ్లతో మాట్లాడుకుంటూ.. చల్లని పళ్ల రసం తాగుతూ ఉంటే ఆ ఆనందమే వేరు” అంటోంది కాజల్. ప్రస్తుతం ‘గోవిందుడు అందరివాడేలే’ కోసం జతకట్టింది. ఈ సినిమా చిత్రీకరణకు కాసింత విరామం రావడంతో కాజల్ చూపు సరదాలవైపు మళ్లింది. ఇంకేముంది స్నేహితులను వెంటబెట్టుకొని షికార్లు చేస్తోంది. అంతేనా ఆ ఫొటోలను ఫేస్‌బుక్ పేజీలో పెట్టి మరీ ఆనందపడుతోంది. ”నేను ఎక్కడ ఉన్నా స్నేహితులకు దగ్గరగా ఉంటాను. వాళ్లతో ఉంటే అదో తెలియని ఆనందం. అలాంటి ఆనందాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి? సినిమా సెట్‌లోనూ అందరితో కలివిడిగా ఉండటం అలవాటు. మన చుట్టూ ఉన్నవారితో సఖ్యతగా ఉంటూ.. సరదగా గడిపితే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మన పని కూడా సులభంగా సాగిపోతుంది” అంటూ గురించి చెప్పుకొచ్చింది కాజల్.
ఎన్టీఆర్‌తో మూడోసారి!: ఎన్టీఆర్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో కాజల్ ఆడిపాడనున్నట్లు సమాచారం. ఇప్పటికే కాజల్ ఎన్టీఆర్‌తో ‘బృందావనం’, ‘బాద్‌షా’లో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరిస్తారు. వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
powered by RelatedPosts