ఇది యువతకి కనెక్ట్ అయ్యే సినిమా

0

Ladies and Gentlemen Movie Stills (5)సినీ పరిశ్రమలో ఎంతోమంది ప్రతిభ ఉన్నా, సరైన అవకాశాలు లేక ఎన్నో అవస్థలు పడుతూ ఉంటారు. అలాంటి వారికి ఒక మార్గం చూపించే పనిని మధుర శ్రీధర్ తన భుజాల వేసుకున్నట్టు కనిపిస్తోంది. తను తాజాగా నిర్మిస్తున్న “లేడీస్ అండ్ జెంటిల్” గురించి మీడియాతో మాట్లాడుతూ, ‘‘ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించాలనే ఆశయంతో ఈ సినిమా నిర్మిస్తున్నా. మంజునాధ్‌లో మంచి దర్శకుడు ఉన్నాడనే నమ్మకంతో ఈ చిత్రానికి అవకాశం ఇచ్చాను. యువతరానికి కనెక్ట్ అయ్యే కథాంశంతో ఈ సినిమా ఉంటుంది’’ అని మధుర శ్రీధర్ చెప్పారు. గోతెలుగు.కామ్ సమర్పణలో పీఎల్ క్రియేషన్స్, షిర్టిసాయి కంబైన్స్‌పై ఎమ్వీకే రెడ్డి, మధుర శ్రీధర్ నిర్మిస్తున్న చిత్రం ‘లేడీస్ అండ్ జెంటిల్‌మెన్’. పీబీ మంజునాధ్ దర్శకుడు. చైతన్యకృష్ణ, అడవి శేష్, కమల్ కామరాజు, మహత్ రాఘవేంద్ర, నిఖితా నారాయణ్, స్వాతీ దీక్షిత్, జాస్మిన్ ముఖ్య తారలు.

చిత్ర సంగీతదర్శకుడు రఘు కుంచె స్వరపరచిన ఈ చిత్రం ప్రచార గీతాన్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న లగడపాటి శ్రీధర్, మల్టీ డైమన్షన్ వాసు, నీలకంఠ తదితరులు ప్రచార గీతం బాగుందని, సినిమా కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నామని అన్నారు. బుర్రకథ నేపథ్యంలో సోషల్ నెట్‌వర్క్ గురించి తెలిపే పాట ఇదని రఘు కుంచె చెప్పారు. మానవ సంబంధాలకంటే సోషల్ మీడియాకే నేటి తరం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, సైబర్ నేరాలు ఎలాంటి ప్రభావం చూపుతున్నాయనే కథాంశాన్ని వినోద ప్రధానంగా తెరకెక్కించామని దర్శకుడు చెప్పారు.

తాజాగా వారు విడుదల చేసిన పాట ఎక్కడో విన్నట్టుగానే ఉంది అనిపించడం ఖాయం. మరి సినిమా ఎంతవరకు జనాల్ని మెప్పించగలదో చూద్దాం.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
powered by RelatedPosts