ఇట్లు ప్రేమతో..

0

అర్జున్, సుర్విన్ చావ్లా జంటగా నటించిన మూండ్రు పేర్ మూండు కాదల్ అనే తమిళ చిత్రాన్ని ఇట్లు ప్రేమతో.. పేరుతో గురుబ్రహ్మ ఆర్ట్స్ పతాకంపై భద్రకాళి, పెద్దబాబు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. వసంత్ దర్శకుడు. యువన్‌శంకర్‌రాజా సంగీతం అందించిన ఈ చిత్ర గీతాల్ని ఆదివారం రాత్రి తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మ విడుదల చేశారు. తొలిప్రతిని దాసరి నారాయణరావు స్వీకరించారు.
ఈ సందర్భంగా దాసరి నారాయణరావు మాట్లాడుతూ ఈ చిత్ర దర్శకుడు వసంత్ ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్‌గారి శిష్యుడు. బాలచందర్ దర్శకత్వం వహించిన ఎన్నో చిత్రాల కథల్లో ఇతని పాత్ర వుంది. ఇప్పటి వరకు ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించారు. ఆయన దర్శకత్వం వహించిన ఈ సినిమా అందిరికి నచ్చుతుంది. మూడు ప్రేమ జంటల నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ మూడు ప్రేమజంటలని కలిపే కీలక పాత్రలో అర్జున్ నటించాడు. ఆడియో విన్నాను. పాటలు బాగున్నాయి అని తెలిపారు. పాటలు, ట్రైలర్స్ బాగున్నాయి. సినిమా మంచి విజయాన్ని సాధించాలి అని డీజీపీ అనురాగ్‌శర్మ అన్నారు. భద్రకాళి ప్రసాద్ మాట్లాడుతూ మూడు ప్రేమకథల నేపథ్యంలో సాగే సినిమా ఇది. తమిళంలో మంచి విజయాన్ని సాధించిన ఈ సినిమా తెలుగులోనూ ఆకట్టుకుంటుందన్న నమ్మకముంది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో వసంత్, వడ్డే నవీన్, రేలంగి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Nela Ticket movie review
Nela Ticket Review: అమ్మ చేతి ముద్దపప్పు ఆవకాయ ఎంత బాగుంటుందో కదా. అమ్మ ప్రతి రొజూ అదే చేసినా ఆనందంగా తింటాం, ఎందుకు అంటే అది ముద్దపప్పు ఆవకాయ ...
‘ఆపరేషన్ 2019’ ట్రైలర్ లాంచ్
“గాంధీ కడుపున గాంధీ పుట్టడు, ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు, మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు.. ఎవరైనా సరే ప్రజల్లో నుంచే రావాలి వివిధ రూపా...
`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
powered by RelatedPosts