ఇక్కడి 'క్వీన్' ఎవరో ఇంకా నిర్ణయించలేదు

0

Kangna-Ranautబాలీవుడ్ లో ఒక ఊపు ఓపిన “క్వీన్” చిత్రం లో కంగనా రనౌత్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. వికాస్ బాల్ దర్శకత్వటంలో రూపొంది, ఘనవిజయం సాధించిన హిందీ చిత్రం ‘క్వీన్’ దక్షిణాది రీమేక్ హక్కుల్ని ప్రముఖ నటుడు, దర్శక, నిర్మాత త్యాగరాజన్ చేజిక్కించుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని ఆయన రూపొందించనున్నారు.

ఈ సందర్భంగా త్యాగరాజన్ మాట్లాడుతూ -‘‘కథానాయికలుగా అనుష్క. కాజల్, తమన్నాలను పరిశీలిస్తున్నాం అనే వార్త ప్రచారంలో ఉంది. వాస్తవానికి త్రిష పేరుని పరిశీలిస్తున్నాం. హిందీలో కంగనా అద్భుతంగా నటించింది. దక్షిణాది రాణిగా ఎవరు నప్పుతారు? అనే విషయాన్ని చర్చిస్తున్నాం. త్వరలో కథానాయికను ఖరారు చేస్తాం’’ అన్నారు. ఈ రీమేక్‌లో మీ అబ్బాయి, హీరో ప్రశాంత్ నటిస్తారా? అనడిగితే -‘‘తను నటిస్తానంటే నాకభ్యతరం లేదు. ప్రస్తుతం తను ‘జులాయి’ రీమేక్‌లో నటిస్తున్నాడు’’ అని చెప్పారు. ప్రస్తుతం ‘జీన్స్ 2’కి సన్నాహాలు చేస్తున్నానని, ఆ చిత్రవిశేషాలు కూడా త్వరలో తెలియజేస్తానని త్యాగరాజన్ తెలిపారు.

ఇంతకీ మరి దక్షిణాది “క్వీన్” గా వెండితెరని ఏలె అద్భుత అవకాశం ఎవరిని వరిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే .

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ప‌వ‌న్ టైటిల్ `రాజా వ‌చ్చినాడు`!
పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈచిత్రానికి ...
మెగాస్టార్ 151వ సినిమా `ఉయ్యాలవాడ` మొద‌లైంది
మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చిత్రం నేడు హైద‌రాబాద్ లో మొదలైంది. కొణిదెల ప్రొడక్షన్స్‌ కార్యాలయంలో పూజా కార్యక...
సాయిధరమ్‌తేజ్‌, ఎ.కరుణాకరన్‌ కాంబినేషన్‌లో కె.ఎస్‌.రామారావు భారీ చిత్రం ప్రారంభం
సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాణ సంస్థ క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత కె...
powered by RelatedPosts