ఇంకా ప్రేమకథలు చేయలేను కదా!

0

Venkatesh Photos (9)కమర్షియల్ సినిమాలు చేస్తున్నప్పటికీ వాటిలో ఏదో ఒక అంశం ప్రేక్షకుల హదయాల్ని స్పశించాలి. అప్పుడే ఆ సినిమాలు విజయం సాధిస్తాయి. ప్రేక్షకులెప్పుడూ సరైన తీర్పునే ఇస్తారు. వారిని మెప్పించే కథాంశాల్ని ఎంచుకోవడం నటీనటులు, దర్శకనిర్మాతలపైనే వుంటుంది అన్నారు వెంకటేష్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం దశ్యం ఈ నెల 11న ప్రేక్షకులుముందుకురానుంది. మలయాళంలో విజయం సాధించిన దశ్యం చిత్రానికి రీమేక్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీప్రియ దర్శకత్వం వహించారు. చిత్ర విడుదలను పురస్కరించుకొని సోమవారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు వెంకటేష్. ఆ విశేషాలివి…

దశ్యం చిత్ర కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలేమిటి?
నేనిప్పటివరకు ఎన్నో కుటుంబకథా చిత్రాల్లో నటించాను. అయితే థ్రిల్లర్ అంశాలు మేళవించిన ఫ్యామిలీఎంటర్‌టైనర్స్ చేయలేదు. రొటీన్‌కు భిన్నంగా కొత్త పంథాలో సినిమా చేయాలనుకుంటున్న తరుణంలో మలయాళంలో దశ్యం చిత్రాన్ని చూశాను. అందులోని కుటుంబ భావోద్వేగాలు, అనుబంధాలు, కథను ఆవిష్కరించిన విధానం చాలా కొత్తగా అనిపించాయి. మంచి కథలు రావడం లేదని కంైప్లెంట్ చేయడం కంటే ఇలాంటి సినిమాల్ని చేయడం బెటర్‌అనే భావన కలిగింది. ఇదొక యూనివర్సల్ ఫీల్ వున్న కాన్సెప్ట్. కథలో వచ్చే సమస్య ప్రపంచంలో ఎవరికైనా ఎదురుకావొచ్చు. తెలుగుప్రేక్షకులకు కథాపరంగా సరికొత్త అనుభూతినిచ్చే చిత్రమిది.

ఇంతకి చిత్ర ఇతివత్తం ఏమిటి…?
భార్య, ఇద్దరు పిల్లలతో ప్రశాంతమైన జీవితాన్ని గడిపే ఓ మధ్యతరగతి తండ్రి కథ ఇది. అతను తన కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తాడో సినిమాల్ని కూడా అంతగా ప్రేమిస్తుంటాడు. సాఫీగా సాగిపోతున్న అతని జీవితంలో అనుకోని ఓ ఉపద్రవం వచ్చిపడుతుంది. దాంతో కుటుంబమంతా చిక్కుల్లో పడే పరిస్థితి వస్తుంది. సినిమా ప్రేమికుడైన అతను తాను చూసిన సినిమాల స్ఫూర్తితోనే ఆ సమస్యను ఎలా అధిగమించాడన్నదే దశ్యం చిత్ర ఇతివత్తం. ఈ సినిమాలోని కుటుంబ అనుబంధాలు ప్రతి ఒక్కరినీ కదిలించేలా వుంటాయి.

ఇద్దరు పిల్లల తండ్రిగా నటించడం ఎలాంటి అనుభూతినిచ్చింది?
ఇంట్లో నాకూ పిల్లలున్నారుకదా! అందుకే సినిమాలో నటించడం కొత్తగా ఏమీ అనిపించలేదు (నవ్వుతూ).
గత కొన్నేళ్లుగా ఎక్కువగా రీమేక్ చిత్రాల్ని చేస్తున్నారు. తెలుగులో కథల కొరతవల్లే మీరు రీమేక్‌ల వైపు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు?
కావాలని రీమేక్ సినిమాల్ని చేయడం లేదు. నేను అనుకున్న టైమ్‌లో అందుబాటులో వున్న కథలతో సినిమాల్ని చేస్తున్నాను. రీమేకా..స్ట్రెయిట్ సినిమా అనే విషయం కంటే మంచికథతో సక్సెస్‌ఫుల్‌మూవీ చేయాలన్నదే నా సిద్ధాంతం.
దశ్యం తమిళ రీమేక్‌ను కమల్‌హాసన్ చేస్తున్నారు. ఈ సినిమా విషయమై ఆయన్నెప్పుడైనా కలిశారా?
నేను అభిమానించే నటుల్లో కమల్‌హాసన్‌గారు ఒకరు.భారతదేశం గర్వించే మహానటుడాయన. ఈ మధ్యే జరిగిన గోవా ల్మ్ ఫెస్టివల్‌లో ఆయన్ని కలిశాను. దశ్యం సినిమా గురించి ఇద్దరం చర్చించుకున్నాం. ఆయన కొన్ని విలువైన సలహాలిచ్చారు.

చాలా విరామం తర్వాత మీనాతో కలిసి నటించడం ఎలా అనిపించింది?
మీనాతో నేను చేసిన నాలుగు చిత్రాలు పెద్ద విజయాన్ని సాధించాయి. మేమిద్దరం హిట్‌పెయిర్‌గా గుర్తింపునుపొందాం. మీనా అద్భుతమైన ప్రతిభ కలిగిన నటి. ఆమె ఎలాంటి పాత్రకైనా న్యాయం చేయగలదు. ఈ సినిమాలో బాధ్యతల్ని పంచుకునే తల్లిగా ఆమె చక్కటి అభినయాన్ని ప్రదర్శించింది.
గతంతో పోల్చుకుంటే కథల ఎంపికలో మీ ప్రాధామ్యాలేమైనా మారాయా?
27ఏళ్లుగా సినిమాలు చేస్తున్నాను. ఇంకా ప్రేమించుకుందాం రా తరహాలో ప్రేమకథలు చేయలేను కదా? నా స్థాయికి తగ్గట్లు పరిణితితో కూడిన కథల కోసం అన్వేషిస్తున్నాను. దశ్యం మలయాళం వెర్షన్ చూసినప్పుడు ఇకనుంచి ఈ తరహా సినిమాలే చేయాలి అనిపించింది.

మల్టీస్టారర్ చిత్రాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. ఇకముందు కూడా ఇదే విధంగా నటిస్తారా?
ఇండస్ట్రీలోని యువహీరోలతో, దర్శకులతో నాకు సత్సంబంధాలున్నాయి. నవ్యమైన కథాంశాలతో వస్తే వారితో సినిమాలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా వుంటాను.
పవన్‌కల్యాణ్‌తో కలిసి చేస్తోన్న గోపాల గోపాల చిత్రం ఎలా వుండబోతోంది?
ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది. త్వరలో పవన్‌కల్యాణ్ షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నారు. అందరూ మెచ్చే కథ ఇది. సినిమాలో పవన్‌కల్యాణ్, నాకు మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా వుంటాయి. సంభాషణలు అద్భుతంగా కుదిరాయి. తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారు.
ఆధ్యాత్మిక భావాలు ఎక్కువగా వున్న మీరు దేవున్ని ప్రశ్నించే నాస్తికుడి పాత్రను చేయడం ఎలా అనిపిస్తోంది?
ఈ ప్రపంచంలో దేవున్ని నమ్మమని చెప్పే చాలా మంది ఎప్పుడో ఒకప్పుడు దేవున్ని నమ్మే వుంటారు. గోపాలగోపాల చిత్రంలో నా పాత్ర దేవుడిని ప్రశ్నించేదిగా వుంటుంది కానీ దేవుడి ఉనికిని కాదు.
ఈ సినిమాలో మీ తనయుడు అర్జున్ నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి?
అర్జున్ పరిచయానికి ఇంకా చాలా టైముంది. వాడిప్పుడు ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూస్తూ బిజీగా వున్నాడు.
మనం తరహాలో మీ కుటుంబసభ్యులతో సినిమా చేయబోతున్నారని అంటున్నారు?
మనంలాంటి కథ దొరకడం నాగార్జున అదష్టం. ఆ సినిమా కథ వారి కుటుంబానికి చక్కగా సరిపోయింది. ఆ తరహా కథలు లభిస్తే మా కుటుంబసభ్యులందరం కలిసి తప్పకుండా సినిమా చేస్తాము.
ప్రతినాయక పాత్రల్లో నటించే ఆలోచన వుందా?
విలన్‌గా నటించాలని వుంది. అయితే ప్రేక్షకులు అలాంటి పాత్రల్లో నన్ను రీసీవ్ చేసుకుంటారో లేదో అనే సందేహముంది. నాగవల్లి చిత్రంలో కొంచెం ప్రతినాయక ఛాయలున్న పాత్రను చేశాను. విలన్ పాత్రల్లో మెప్పించాలంటే పాత్ర చిత్రణ పవర్‌ఫుల్‌గా, కొత్త తరహాలో వుండాలి.
రాష్ట్ర విభజన జరిగిపోయిన నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్‌ను కూడా రెండుగా విభజించాలనే డిమాండ్ వస్తోంది. సీనియర్ హీరోగా ఈ వ్యవహారంపై మీరేమంటారు?
నేను ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి సిద్ధమే. ఫలానా రాష్ట్రంవారన్న విషయాల్ని గురించి నేను ఆలోచించను. ఫిల్మ్ ఛాంబర్ వ్యవహారాన్ని తేల్చడానికి పరిశ్రమ పెద్దలున్నారు. అయితే ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అంతిమంగా అంతా సాఫీగా జరిగిపోవాలని కోరుకుంటున్నాను. అలాగే పరిశ్రమలో నిర్లక్ష్యానికి గురవుతున్న వారికి అవకాశాలిచ్చి ప్రోత్సహించాల్సిన బాధ్యత సినీపరిశ్రమపై వుందని నా అభిప్రాయం.

మారుతి దర్శకత్వంలో నటిస్తున్న రాధా చిత్రం ఎంతవరకు వచ్చింది?
ఆ సినిమా చేయడం లేదు. అనుకోనికారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ రద్దయింది.
తదుపరి ఏ సినిమాలు చేయబోతున్నారు?
ప్రస్తుతం కథాచర్చలు జరుగుతున్నాయి. ఇంకా ఏ సినిమా ఖరారుకాలేదు. కొత్తదనం వున్న కథలకోసం ఎదురుచూస్తున్నాను.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 8th December 2017
[caption id="attachment_550514" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 8th December 2017[/caption]...
Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts