ఆ సినిమాపై కేసు వేసిన సూపర్‌స్టార్?

0

Rajinikanth06ఎవరికి వారు ఇస్తాం వచ్చినట్టు కథలు వ్రాసుకోవడం… తోచినట్టు సినిమాలు తీయడం చేస్తున్నారు అని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నట్టుగానే, ఈ ప్రస్తుత ఉదంతం అందుకు ఉదాహరణగా నిలుస్తుంది. ఒక హీరోని తమ బాగు కోసం ఉపయోగించుకుంటే వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే, గతంలోనూ – ప్రస్తుతం అలా పవన్ కల్యాణ్ పేరుని, రజనీకాంత్ పేరుని వాడుకుని ఎంతోమంది లబ్ది పొందారు. అందుకు సదరు హీరోల నుండి ఎప్పుడూ ఎటువంటి ఆబ్‌జెక్షన్ ఎదురుకాలేదు. కానీ, ఆ అభిమానం శ్రుతిమించి, ఏకంగా స్టార్ హీరోలకే ఇబ్బంది కలిగేలా ఉంటే వాళ్ళు కలుగజెసుకోకుండా ఉంటారా? అందుకే తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రంగంలోకి దిగాల్సి వచ్చింది.
సూపర్ స్టార్ రజినీకాంత్ కేసు వేయడంతో ‘మై హు రజనీకాంత్’ అనే హిందీ సినిమా విడుదలపై స్టే చెన్నై హైకోర్ట్ స్టే విధించింది. నిర్మాతలను కోర్ట్ కు స్వయంగా హాజరయి సమాధానం ఇవ్వవలసిందిగా ఆదేశించింది.

అసలు వివరాలలోకి వెళ్తే ‘బిల్లా’, ‘సింహ’, ‘దూకుడు’, ‘మిర్చి’ తదితర తెలుగు సినిమాలలో నటించిన తమిళ నటుడు ఆదిత్య ప్రధాన పాత్రలో ‘మై హు రజనీకాంత్’ అనే హిందీ సినిమా రూపొందింది. ఈ సినిమాలో కాంట్రాక్ట్ కిల్లర్ కం సిబిఐ ఆఫీసర్ రజినీకాంత్ రావు పాత్రలో ఆదిత్య నటించాడు. త్వరలో విడుదలకు సిద్దమవుతుంది. ఈ సినిమా తన ఇమేజ్ డామేజ్ చేసే విధంగా ఉందని, అందువల్ల సినిమా విడుదలపై నిషేధం విధించాలని రజినీకాంత్ కోరారు. రజిని విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న చెన్నై హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారి చేసింది.

అదీ విషయం.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
అదరగొడుతున్న మాస్ మహారాజా రవితేజ "నేల టిక్కెట్టు" ట్రైలర్‌:
మాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడి ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, వెటకారపు డైలాగులు ఉంటాయి, మంచి ఎమోషన్...
powered by RelatedPosts