ఆయన ఇప్పటికీ గుర్తే

0

Sumaనటసామ్రాట్ దివంగత అక్కినేని నాగేశ్వరరావు జయంతి నేడు. ఆయన పరమపదించాక అభిమానులు జరుపుకుంటున్న మొదటి జయంతి.

ఈ సందర్భంగా ఎందరో సినీ సెలెబ్రిటీలు అక్కినేనితో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు. వారిలో యాంకర్ సుమ ఒకరు. అక్కినేని నాగేశ్వరరావుతో తనకున్న అనుబంధాన్ని ఇదిగో..ఇలా పంచుకుంటోంది…

‘‘నేను వ్యాఖ్యానం చేసిన పలు కార్యక్రమాలకు ఏయన్నార్ అతిథిగా వచ్చేవారు. అలా ఆయనతో కొంత పరిచయం ఏర్పడింది. అయితే, ఆ మహానటునితో బంధం బలపడింది మాత్రం ‘మట్టిమనుషులు’ సీరియల్ టైమ్‌లోనే. అందులో నేను ఆయనకు కూతురిగా చేశాను. ఆయనతో నటించడానికి భయపడుతుంటే, నాతో చనువుగా మాట్లాడి నాలోని భయాన్ని పోగొట్టారు. సెట్‌లో అక్కినేనిగారుంటే ఆ సందడే వేరు. నాపై పుత్రికావాత్సల్యాన్ని ప్రదర్శించేవారాయన. ‘తెలుగమ్మాయివి కాకపోయినా.. నీ తెలుగు చూస్తుంటే ముచ్చటేస్తుంది’ అనేవారు. అక్కినేని అన్నపూర్ణగారు కూడా నాపై ఎంతో అభిమానాన్ని చూపించేవారు. ‘నువ్వు ఫలానా ప్రోగ్రామ్‌లో… అలా చేశావ్, ఇలా చేశావ్’ అని నాకే గుర్తు చేసేవారామె. ఆ పుణ్యదంపతుల అభిమానాన్ని చూరగొనడం నా అదృష్టం.

84వ పుట్టినరోజు సందర్భంగా తొలిసారి అక్కినేనిగారిని ఇంటర్వ్యూ చేశాను. ఆయనతో నేను అన్న తొలి మాట… ‘మీకు 84 ఏళ్లు అంటే నమ్మను’ అని. అప్పుడు ఆయన నవ్విన నవ్వు నాకింకా గుర్తుంది. ‘మా టీవీ’లో ప్రసారమైన ‘గుర్తుకొస్తున్నాయి’ కార్యక్రమం నా జీవితంలో మరచిపోలేనిది. 74 వారాల పాటు అక్కినేని జీవితాన్ని ఆవిష్కరించిన ఆ కార్యక్రమంలో ఆయన్ను ప్రశ్నలడిగే భాగ్యం నాకు దక్కింది.

నాగేశ్వరరావుగారికి పొగడ్తలంటే అస్సలు పడదు. మనుషుల్ని ఆయన చదివినట్లు ఎవరూ చదవలేరు. ఆయన జ్ఞాపకశక్తి అద్భుతం. శతాబ్దాల క్రితం జరిగిన విషయాలను కూడా నిన్ననో మొన్ననో జరిగినట్లు ఈజీగా చెప్పేసేవారు. ఏయన్నార్ ఒక్కో సినిమా ఒక్కో పాఠం. ఒక్కో మలుపు ఒక్కో సందేశం. అందులో నేర్చుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి.యాదృచ్ఛికంగా ఏయన్నార్ చివరి ఇంటర్వ్యూ కూడా నేనే చేశాను. ఆయన పుట్టిన రోజు సందర్భంగా గత ఏడాది ఇదే రోజున ఆయన మనవళ్లు సుమంత్, సుశాంత్, నాగచైతన్యలతో కలిపి ఏయన్నార్‌తో చేసిన ఇంటర్వ్యూ అది. ఆ తర్వాత నెల రోజులకే ఆయనకు కేన్సర్ అన్న విషయం బయటపడింది. మళ్లీ పార్ధివ దేహాన్నే చూడగలిగాను. ఆయన భౌతికంగా లేరు కానీ…. తెలుగు సినిమా బతికున్నంత వరకూ సినిమాల రూపంలో ఎప్పుడూ మనముందే ఉంటారు’’.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
అదరగొడుతున్న మాస్ మహారాజా రవితేజ "నేల టిక్కెట్టు" ట్రైలర్‌:
మాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడి ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, వెటకారపు డైలాగులు ఉంటాయి, మంచి ఎమోషన్...
powered by RelatedPosts