'ఆదిత్య'.. ఓ మంచి విద్యార్థి

0

Santhosh Films Openingమాస్టర్ ప్రవీణ్, రాహుల్, రోమీర్, షణ్ముఖ, విష్ణు, లిఖిత్, వైష్ణవి ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘ఆదిత్య’. బ్రహ్మానందం ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. సుధాకర్ గౌడ్ భీమగాని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య క్లాప్‌నిచ్చారు. అశోక్‌కుమార్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. పి.విజయవర్మ గౌరవ దర్శకత్వం వహించారు. తాటికొండ రాజయ్య మాట్లాడుతూ ”బాలలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి పాఠశాలలే పునాదులు. దేశాన్ని అభివృద్ధి పరిచేలా విద్యార్థుల్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే. ఇదే విషయాన్ని ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నారు. ఇలాంటి మరిన్ని చిత్రాలు రావాలి. ఇందుకోసం మా ప్రభుత్వం నుంచి అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామ”న్నారు. ”విద్యార్థి లోకానికి ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఆగస్టు 15 నాటికి సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామ”న్నారు సుధాకర్‌గౌడ్. చిత్రానికి సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, ఛాయాగ్రహణం: కందేటి శంకర్, కళ: భాస్కర్

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts