ఆగడు హైదరాబాద్‌లో జరుగుతోంది

0

Mahesh Babu Presents Idea Students Awards (24)మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఆగడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్నా కథానాయిక. మహేష్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇటీవల కర్ణాటకలోని బళ్లారి గనుల్లో కీలక ఘట్టాల్ని పూర్తి చేసిన శ్రీను వైట్ల ప్రస్తుతం తాజా షెడ్యూల్‌ని హైదరాబాద్‌లో మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

ఇక్కడే కీలక సన్నివేశాలతో పాటు మహేష్, శృతిహాసన్‌లపై ఓ ఐటమ్ సాంగ్‌ను రూపొందిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ పాట ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ షెడ్యూల్ పూర్తి కాగానే చిత్ర యూనిట్ ఆగస్టు రెండవ వారంలో నార్వేకు పయనం కానుందని తెలిసింది. అక్కడ మహేష్‌బాబు, తమన్నాలపై రెండు పాటలు చిత్రీకరించనున్నారని చిత్ర వర్గాల సమాచారం. మహేష్ సరికొత్త తరహాలో కనిపించబోతున్న ఈ సినిమాను సెప్టెంబర్ మూడవవారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్, నదియా, సోనూసూద్, బ్రహ్మాజీ, బ్రహ్మానందం, నెపోలియన్, సాయికుమార్, ఎం.ఎస్.నారాయణ, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన:అనిల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, రచనా సహకారం: ప్రవీణ్‌వర్మ, సంగీతం: ఎస్.ఎస్.తమన్, సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, ఆర్ట్: ఎ.ఎస్.ప్రాకాష్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
powered by RelatedPosts