"ఆగడు" పై పవన్ అభిమానుల సెటైర్స్

0

Aagadu-003ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సూపర్‌స్టార్ మహేష్బాబు ‘ఆగడు’ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల కావడంతో, ఈ రోజు ఉదయం నుండే మహేష్ అభిమానులలో పండుగ వాతావరణం నెలకొని ఉంది. అయితే ఈ ఫస్ట్ లుక్ ను ‘గబ్బర్‌ సింగ్‌’ లోని స్టైల్ ను యధాతధంగా మహేష్ చేత శ్రీనువైట్ల కాపీ చేయించి ఈ స్టిల్ ను ఫస్ట్ లుక్ గా వదిలారని అంటూ కొంత మంది పవన్ అభిమానులు ,”ఆగడు” చిత్ర నిర్మాతల్లో ఒకరైన రామ్ ఆచంట ఫేస్‌బుక్ లో పోస్ట్ చేసిన దగ్గరనుండే విమర్శలు గుప్పిస్తున్నారు .

ఇదిలా ఉండగా ఈరోజు ఉదయం విడుదల అయిన మహేష్ ‘ఆగడు’ టీజర్ మహేష్ రాయలసీమ యాసలో చెప్పిన పంచ్ డైలాగ్స్ తో ఆదరగోడుతోంది. గతంలో ‘వన్’ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ లో దొర్లిన పొరపాట్లను రిపీట్ చేయకుండా ‘ఆగడు’ మొదటి టీజర్ నుండే మంచి క్రేజ్ కలిగించేలా శ్రీను వైట్ల తీసుకున్న జాగ్రత్తలు అడుగడుగునా కనిపించాయి. ఈ టీజర్ ను చూసిన మహేష్ అభిమానులు “మైండ్ బ్లోయింగ్’ అంటు ఈరోజు ఉదయం నుండే వెబ్ మీడియాలో హడావిడి మొదలు పెట్టేసారు. మరి ఈ టీజర్ కు ఎటువంటి స్పందనతో పాటు ఎన్ని లక్షల హిట్స్ వస్తాయో చూడాలి.

ఏదేమైనా, “దూకుడు” లో ఉన్నంత “మ్యాటర్” , “ఆగడు” లో లేదేమో అని ట్రైలర్ చూసిన చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే, ప్యాంచ్ డైలాగుల మీదనే ఎక్కువగా ధ్యాసపెట్టినట్టు తెలుస్తోంది. కోన వెంకట్ అండ్ కొ. తో గొడవ అయిన దగ్గర నుండి, కొత్తవాల్ళతో డైలాగులు రాయించుకున్న శ్రీను వైట్ల, కథ కంటే కేవలం డైలాగుల మీదే ఎక్కువగా దృష్టి పెట్టాడు అనే విమర్శలు కూడా టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

సాహో కోసం మ‌రో బాలీవుడ్ స్టార్
ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `సాహో` కోసం చిత్ర ద‌ర్శ‌కుడు సుజీత్ ఏకంగా బాలీవుడ్ తారాతోర‌ణాన్ని రంగంలో కి దించేస్తున్నాడు. ఇప్ప‌టికే హీరో...
స్పైడ‌ర్ ఈవెంట్ కు రోబో కాబింనేష‌న్!
మ‌హేష్ క‌థానాయకుడిగా ఏ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `స్పైడ‌ర్‌` తెలుగు, త‌మిళంలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతున్న సంగతి తెలిసిందే...
పైసా వ‌సూల్ సాంగ్ టీజ‌ర్
`కన్ను కన్ను కలిశాయి.. ఎన్నో ఎన్నో తెలిశాయి` అంటూ సాగే వీడియో సాంగ్ ను విడుదల చేసింది పైసా వసూల్ చిత్రబృందం. నందమూరి బాలకృష్ణ, శ్రియ మధ్య సాగుత...
powered by RelatedPosts