ఆఖరుకి ఆవిడే ఆయనకి నచ్చిందట..

0

radhika apteనందమూరి నట సింహం బాలకృష్ణ తన కెరీర్‌లో వందవ సినిమాకి చేరువవుతున్నా కొద్దీ, ఒక్కో సినిమాని ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నాడు. ప్రతీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడు. మరీ ముఖ్యంగా తనతో పాటు నటించే హెరోయిన్ల ఎంపిక విషయంలో బాలయ్య ఎక్కడా తగ్గడం లేదు. బాలకృష్ణ తాజాగా నటిస్తున్న 98వ సినిమాలో సెకండ్ హీరోయిన్’గా రాధికా ఆప్టేను ఎంపిక చేసినట్టు యూనిట్ వర్గాలు కన్ఫర్మ్ చేశాయి. ‘లెజెండ్’ సినిమాలో బాలకృష్ణ మేనకోడలుగా రాధికా ఆప్టే నటించింది. ఆమె నటనకు మంచి పేరొచ్చింది. ‘లెజెండ్’ తర్వాత మరోసారి బాలయ్య సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది రాధికా. ఈ పాత్ర కోసం ఎందరో పేర్లు పరిశీలించినా, చివరిగా రాధికనే అవకాశం వరించింది.

సత్యదేవ దర్శకత్వంలో రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న బాలయ్య 98వ సినిమాలో త్రిష ఒక హీరోయిన్ గా నటిస్తుంది. రాధిక ఆప్టే మరొక హీరోయిన్. ఇద్దరు హీరోయిన్లకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ‘లెజెండ్’లో రాధిక నటన చూసి ఈ సినిమాకు ఎంపిక చేశాం. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో నటిస్తుంది. అని యూనిట్ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఇటివల షూటింగ్లో గాయపడడంతో కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్న బాలయ్య తిరిగి షూటింగ్లో పాల్గొంటున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

సాహో కోసం మ‌రో బాలీవుడ్ స్టార్
ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `సాహో` కోసం చిత్ర ద‌ర్శ‌కుడు సుజీత్ ఏకంగా బాలీవుడ్ తారాతోర‌ణాన్ని రంగంలో కి దించేస్తున్నాడు. ఇప్ప‌టికే హీరో...
స్పైడ‌ర్ ఈవెంట్ కు రోబో కాబింనేష‌న్!
మ‌హేష్ క‌థానాయకుడిగా ఏ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `స్పైడ‌ర్‌` తెలుగు, త‌మిళంలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతున్న సంగతి తెలిసిందే...
పైసా వ‌సూల్ సాంగ్ టీజ‌ర్
`కన్ను కన్ను కలిశాయి.. ఎన్నో ఎన్నో తెలిశాయి` అంటూ సాగే వీడియో సాంగ్ ను విడుదల చేసింది పైసా వసూల్ చిత్రబృందం. నందమూరి బాలకృష్ణ, శ్రియ మధ్య సాగుత...
powered by RelatedPosts