ఆఖరుకి అదే ఖాయామయ్యేలా ఉందట

0

chiru-150th-movie-imagesచిరంజీవి నూటా యాభయ్యో సినిమా చేయాలనుకున్నప్పుడే ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవితాన్ని ఆధారంగా తీసుకుని పరుచూరి బ్రదర్స్ ఓ స్ర్కిఫ్ట్ తయారు చేసిన విషయం తెలిసిందే. ఈ సబ్జెక్ట్ తో నందమూరి నటసింహం బాలకృష్ణతో సినిమా చేయాలనుకున్నా, కొన్ని కారణాల వల్ల ఆది కుదరలేదు. ఆ తర్వాత నాగార్జున దృష్టికి కూడా ఈ సబ్జెక్ట్ వెళ్లింది. అది కూడా వర్కవుట్ అవ్వలేదు. అప్పట్లో చిరంజీవి తన 150వ సినిమాని ఈ స్ర్కిఫ్ట్ తో చేయాలనుకున్నారు. కానీ రాజకీయాల్లోకి వెళ్లడంతో చిరంజీవి 150వ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమా సన్నాహాల్లో ఉన్నారు. ఈ సినిమా కోసం చాలా కథలు వింటున్నారట. ఇప్పటివరకూ ఏ కథా చిరుకి నచ్చకపోవడంతో చిరు మనసులో ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ స్ర్కిఫ్ట్ మెడులుతోంది అని విశ్వసనీయ సమాచారం. పరుచూరి బ్రదర్స్ ని పిలిపించి చిరు ఈ సబ్జెక్ట్ గురించి అడిగారట. వి.వి.వినాయక్ ని ఈ స్ర్కిఫ్ట్ చూడమని, పూర్తిగా స్ర్కిఫ్ట్ తయారు చేస్తే ఈ సబ్జెక్ట్ తో సినిమా చేద్దామని చెప్పాడట చిరు.

ఇదిలా ఉంటే మణిరత్నం చెప్పిన కథ చిరంజీవికి నచ్చిందని, ఆ కథతోనే చిరు 150వ సినిమా రూపొందనుందని వార్తలు వచ్చాయి. మణిరత్నం దర్శకత్వంలో సినిమా చేస్తానని చిరు చెప్పిన మాట వాస్తవమేనట. కాకపోతే అది 150వ సినిమా కాదట. 150వ సినిమా చేసిన తర్వాత మణిరత్నం దర్శకత్వంలో సినిమా చేస్తానని మాటిచ్చాడట చిరంజీవి.

అంటే, మణిరత్నం చిరుకి 150 సినిమా హిట్ ఇస్తాడన్న నమ్మకం లేదా ? లేక, వినాయకి కి ముందే మాట ఇవ్వడం మణిరత్నం తో తర్వాత సినిమా చేస్తాను అనడానికి కారణమా?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

వినాయ‌క చ‌వితికి జై కానుక ఇదే
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జై లవ కుశ’. ఇందులో తారక్‌ ‘జై’, ‘లవ’, ‘కుశ’ అనే మూడు పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ...
ప్రియ‌మ‌ణి ఇంట్లో పెళ్ళి సంద‌డి
హీరోయిన్ ప్రియమణి వివాహం తన ప్రియుడు ముస్తఫారాజ్ తో ఈ నెల 25న వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రియమణి ఇంట్లో పెళ్లి సందడి నెల‌కోంది. మూడు రోజు...
స్పైడ‌ర్‌` ఓన్లీ రెండు భాష‌ల్లోనే?
స్పైడర్ తెలుగు వెర్షన్ విడుదలకు చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి. అదే సమయంలో తమిళ వెర్షన్ కూడా విడుదలవుతుంది. అయితే ముందు అనుకున్నట్లు హిందీ వెర...
powered by RelatedPosts