అసలేం ఉంది వీరిద్దరి మధ్య?

0

ranaటాలీవుడ్ మాచోమాన్ దగ్గుబాటీ రాణా,మూడుపదుల వయసులో మత్తెక్కిస్తున్న చెన్నై చంద్రం త్రిష ఇద్దరూ కలిసి గత కొంతకాలంగా చాలా చోట్ల దర్శనమిస్తున్నారు. చెట్టాపట్టాల్ వేసుకుని పబ్బులు – పార్కులు గట్రా తిరుగుతూ డ్యూయేట్లు పాడుకుంటున్నారు. సహజంగానే ఇలాంటి విన్యాసాలు చూసినప్పుడు అసలేం జరుగుతోంది వీళ్ళ మధ్యన తెలుసుకోవాలి అని కుతూహలం కలగక మానదు. అవునూ… అసలేం ఉంది వీరిద్దరి మధ్య?

కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉన్న హీరో, హీరోయిన్లు త్రిష, రానా దగ్గుబాటి మరోసారి హైలెట్ అయ్యారు. శనివారం కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్ వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో ఈ జంట హల్చల్ చేసింది. వీరిద్దరూ చేతిలో చేయి వేసుకుని ఈ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యారు. ఇక గత కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నా త్రిష మాత్రం ఎప్పటికప్పుడు మీడియాలో నానుతూనే ఉంది.

తాజాగా దుబాయ్లో జరిగిన సైమా అవార్డుల ఫంక్షన్లోనూ వీరిద్దరూ కలిసే కనిపించారు. ఈ వేడుక తర్వాత బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఇచ్చిన లేట్‌నైట్‌ పార్టీలో రానా, త్రిష బాగా ఎంజాయ్‌ చేశారనీ గుసగుసలు వినిపించాయి. అంతకు ముందు అమెరికాలో తెలుగు సంఘాల కార్యక్రమానికి అతిథిగా వెళ్లిన రానా అక్కడ త్రిషతో ఊరంతా చక్కర్లు కొట్టినట్లు వార్తలు వెలువడ్డాయి. చాలా ప్రయివేటు కార్యక్రమాల్లోనూ ఈ జంట ఎక్కువగా కనిపించింది.

గత కొంతకాలంగా ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్లోనూ రానా, త్రిషల మధ్య సమ్థింగ్ సమ్థింగ్ అని పుకార్లు షికార్లు చేసినా వారిద్దరు మాత్రం అబ్బే అదేమీ లేదు… మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని చిలకపలుకులు చెప్పటం విశేషం. అలాగే వీరి పెళ్లికి సంబంధించిన వార్తలు వెలువడినా అవన్ని రూమర్స్ అని కొట్టిపారేశారు. గతంలో వీరిద్దరి మధ్య ప్రేమ బ్రేకప్ అయ్యిందనే వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా త్రిష, రానా జంట మరోసారి వార్తల్లో నిలిచారనటంలో సందేహం లేదు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

"సత్య గ్యాంగ్" సాంగ్స్ సూపర్ అంటున్నారు!!
సాత్విక్ ఈశ్వర్ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్యాప...
స‌రిహ‌ద్దు సైనిక‌ల‌తో సూర్య వాలీబాల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయకుడిగా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో నా పేరు సూర్య చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిస...
అల్లు రామ‌లింగ‌య్య హోమియో కాలేజ్ కు మెగాస్టార్ కోటి రూపాయ‌లు విరాళం
మెగాస్టార్ చిరంజీవి చేసే సేవా కార్య‌క్ర‌మాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స‌హాయ‌మంటూ వెళ్లిన వారికి ఆయ‌న స‌హాయం ఎప్పుడూ అందుతూనే ఉంటుంది. తాజాగా ...
powered by RelatedPosts