అవంతిక పోరాటాలు

0

tamanna-bhatia-22-vచారిత్రక చిత్రం బాహుబలిలో మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె అవంతిక అనే యువరాణి పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ బాహుబలిగా, శివుడిగా ద్విపాత్రాభినయాన్ని చేస్తున్నారు. బాహుబలి సరసన అనుష్క కథానాయికగా నటిస్తుండగా, శివుడికి జోడీగా తమన్నా నటిస్తోంది. ఈ సినిమా కోసం అనుష్క వివిధ యుద్ధ విద్యల్లో తర్ఫీదు పొందిన విషయం తెలిసిందే. ప్రత్యేక శిక్షకుల సహాయంతో ఆమె గుర్రపుస్వారీ, కత్తిసాము నేర్చుకుంది. ఇదే తరహాలో ఈ సినిమా కోసం తమన్నా సైతం యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకుంటోందట. చిత్రంలో కథానుగుణంగా ఆమె కూడా రొమాంచిత పోరాటఘట్టాల్లో భాగం కానుందట. ఆయుధాలు చేతబూని శత్రు సంహారం చేసే వీర పోరాటయోధురాలు అవంతికగా తమన్నా పాత్ర చిత్రణ భిన్న పార్శాల్లో సాగుతుందని, ఆమె పాత్ర చిత్రానికి ప్రత్యేకకాకర్షణగా నిలుస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. నటిగా తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే పాత్రను చేయడం పట్ల తమన్నా ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న బాహుబలి చిత్రం తాలూకు తాజా షెడ్యూల్ ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

ఇందులో చిత్ర ప్రధాన తారాగణమంతా పాల్గొనగా కొన్ని కీలక ఘట్టాల్ని చిత్రీకరించబోతున్నారు. ఈ షెడ్యూల్‌లో తమన్నా కూడా పాల్గొంటోంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
powered by RelatedPosts