అలీతో.. జాలీగా' (కండిషన్స్ అప్లై)

0

SIV_04360002హాస్య నటుల్లో అలీ రూటు సపరేటు. అతనెక్కడ ఉంటె అక్కడ నవ్వుల పండుగే. వెండితెర, బుల్లితెర, ఆడియో వేడుక అనే తేడా లేదు. స్పాంటేనియస్ గా పంచ్ డైలాగులు వేస్తూ.. నవ్వించడం అలీ స్పెషాలిటీ. వెండితెరపై నవ్విస్తూనే బుల్లితెరపై ‘అలీ 369’, ‘ఏటీయం’, ‘అలీ టాకీస్’ రియాలిటీ షోలతో సందడి చేశాడు. తాజాగా “అలీతో జాలీగా” అనే కొత్త ప్రోగ్రాంతో బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. కండిషన్స్ అప్లై అనేది ఉప శీర్షిక. సూపర్ హిట్ రియాలిటీ షోల దర్శకుడితో ఈ ప్రోగ్రాం చేస్తున్నారు.

జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై ప్రవీణ్ కడియాల నిర్మాతగా అనిల్ కడియాల దర్శకత్వంలో ఒక ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో ప్రైమ్ టైంలో ఈ షో టెలికాస్ట్ కానుంది.

దర్శకుడు అనిల్ కడియాల మాట్లాడుతూ.. ఇది అలీ గారి కోసమే ప్లాన్ చేసిన ఫేం షో. గతంలో నేను చేసిన ‘వావ్’, ‘మోడ్రన్ మహాలక్ష్మి’ సూపర్ డూపర్ హిట్ ప్రోగ్రామ్స్ గా నిలిచాయి. ఆ ప్రోగ్రామ్స్ ను ఆదరించినట్టుగా.. ఈ ప్రోగ్రాంను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అని అన్నారు.

అలీ మాట్లాడుతూ.. అలీకి ఇది మంచి గేమ్ షో అవుతుంది. బుల్లితెరపై సంచలనాత్మక గేమ్ షో అవుతుందని ఆశిస్తున్నాను. అనిల్ మీద నమ్మకంతో ఈ గేమ్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాను. స్వరాభిషేకం, అలీ 369.. షోల కంటే ఈ ‘అలీతో.. జాలీగా’ షోను ఆదరిస్తారని నమ్ముతున్నాను. అని అన్నారు.Hello

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts