అలియా రూటు హాటయా!

0

Alia Bhattఇన్నాళ్లూ ఇమ్రాన్ హష్మిని ‘సీరియల్ కిస్సర్’ అనే ముద్దుపేరుతో పిలుచుకున్నారు సినీ అభిమానులంతా. ‘మర్డర్’ నుంచి ‘జన్నత్’ వరకు అతగాడు కష్టపడి సంపాదించుకున్న ఈ గుర్తింపు ఇప్పుడిక పోయేలాగే ఉంది. అతగాడు ముద్దు దృశ్యాల్లో నటించడం మానేయడం వల్ల కాదు. పోనీ ఏ అర్జున్ కపూరో, సిద్ధార్థ్ మల్హోత్రానో తమ సినిమాల్లో కథానాయికలను గాఢంగా చుంబించడం వల్ల కూడా కాదు. అంతా అలియా భట్ వల్లనే. ఆమె నటించిన మూడు సినిమాల్లోను అదర చుంభనాలు యువ ప్రేక్షకులను గిలిగింతలు పెట్టడం గురించే మాట్లాడుకుంటున్నారంతా. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ 21 ఏళ్ల చిన్నది తొలి సినిమాలోనే బికినీలో కనిపించింది. సిద్ధార్థ్ మల్హోత్రాతో లిప్‌లాక్ చేసింది. ఆ తర్వాత ‘హైవే’ సినిమాలో రణదీప్ హుడాతోనూ ముద్దు సన్నివేశాలకు వెనుకంజ వేయలేదు. ఇక ‘2స్టేట్స్’లో అర్జున్ కపూర్‌తో రెచ్చిపోయింది. ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో కూడా ముద్దులకు దిగి వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందనే చర్చలకు తెరతీసింది. ఆమె రాబోయే సినిమా ‘హంప్టీ శర్మాకి దుల్హనియా’ కూడా అలియా, వరుణ్‌ధావన్‌ల మధ్య ఉన్న ముద్దుల సన్నివేశాల వల్ల సెన్సార్ ఇబ్బందుల్లో పడింది. ఆ దృశ్యాలకు క్లోజప్‌లు కత్తిరించాలని, లాంగ్‌షాట్లు ఓకేనని సెన్సార్ సుద్దులు చెప్పిందట. ఈ విషయాలను అలియా తండ్రి మహేష్‌భట్ దగ్గర ప్రస్తావిస్తే ఆయన కూడా ఇంతెత్తున లేచారు. ‘మీడియా అనవసరంగా ఈ విషయాన్ని పెద్దది చేస్తోంది. ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో 21 ఏళ్ల వయసున్న అమ్మాయి తెర మీద ముద్దుగా నటిస్తే ఇంత రాద్ధాంతమా? హాలీవుడ్‌లో ఇలాంటి వాటిని పట్టించుకోరు’ అంటూ కోప్పడుతున్నారు. అక్కడితో ఆగారా? ‘ఏం సీరియల్ కిస్సర్ అనే గుర్తింపు మగవాళ్లకే ఉండాలా? ఆడవారికి ఎందుకు ఉండకూడదు? అలియా ఒక నటి. ఆమె దారి ఆమె ఎంచుకుంది. తన అభిప్రాయాల్ని నేను గౌరవిస్తాను’ అని కూడా సెలవిచ్చారు. ఇక చెప్పేదేముంది?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
powered by RelatedPosts