అమ్మాయిలకి అవి ఉంటాయి..అయితే ఏంటి?

0

Hot-deepika-padukone-5నానాటికీ పాత్రికేయ విలువలు దిగజారుతున్నాయి అనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. హీరోయిన్లు అంటే ముఖ్యంగా మీడియాకి మహా చులకన అనిపించేలా ఈ తాజా సంఘటన నిలుస్తుంది అని చెప్పవచ్చు. ఏం రాసినా- ఏం చేసినా ఎదుటి మనిషిని నొప్పించే విధంగా చేయకూడదు కానీ, ఇలా “ఆడదాన్ని కనుక నాకు వక్షోజాలు ఉంటాయి…దానివల్ల మీకేమైనా ప్రాబ్లెమ్ ఆ? అంటూ తనపై చెడుగ వార్తలు రాసిన ఒక పేర్మొసిన ఆంగ్ల దినపత్రికని కడిగి పాడేసింది దీపిక.

మహిళలను.. ముఖ్యంగా హీరోయిన్లను చూసే దృక్కోణం మారాలంటూ దీపికా పదుకొనే తీవ్రంగా స్పందించారు. తన వస్త్రధారణ విషయంలో ఓ ప్రముఖ దినపత్రిక వ్యవహరించి తీరును దులిపి పారేసింది. ఆమెకు ఒక్కసారిగా అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తింది. బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, దర్శకుల దగ్గర నుంచి సామాన్య ప్రేక్షకుల వరకు ప్రతి ఒక్కరూ దీపికకు, ఆమెతో పాటు మొత్తం నారీ లోకానికి అండగా నిలబడ్డారు.

తన వస్త్రధారణపై ‘ఫైండింగ్ ఫ్యానీ’ హీరోయిన్ దీపికా పదుకొనే ట్విట్టర్ లో గట్టిగా స్పందించారు. తాను అందాలను (ఎక్స్ పోజింగ్) ప్రదర్శిస్తూ వస్త్రాలను ధరించినట్లు వచ్చిన విమర్శలకు ఆమె చాలా ఘాటుగా సమాధానం ఇచ్చారు. తాను మహిళనని, తనకు స్త్రీలకు ఉండే సహజ సౌందర్యం ఉంటుందని తెలిపారు. ‘అయితే మీకేంటి సమస్య?’ అని ప్రశ్నించారు. మహిళలను గౌరవించడం చేతకాకపోతే వారి గురించి మాట్లాడవద్దని సలహా ఇచ్చారు.

ఆమె ట్వీట్స్ సోషల్ మీడియాలో సంచలనం రేపాయి. ఆమె వ్యాఖ్యలకు పలువురు మద్దతు పలికారు. ఆమెకు గంటలోపలే దాదాపు 15 వందల మంది స్పందించారు. ఒక మహిళ తన అందాన్ని కాస్త ప్రదర్శిస్తే, దానిని తప్పుగా భావించాలా? ఆ అందాలను అసభ్యంగా చూడాలా? స్త్రీ సహజ సౌందర్యంగా ఎందుకు భావించరు? అని పలువురు ప్రశ్నించారు.

ఏ మీడియా వాల్ళకైనా లేక మరెవరికైన దీపిక ప్రశ్నలకి జవాబు చెప్పే దమ్ముందా?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
బగ్గిడి గోపాల్ సినిమా ఆడియో విడుదల
గ్గిడి ఆర్ట్స్ మూవీస్ పతాకంపై దర్శకుడు అర్జున్ కుమార్ రూపొందిస్తున్న చిత్రం బగ్గిడి గోపాల్. మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ జీవిత కథతో ఈ సినిమా...
యూనివర్సల్ సబ్జెక్ట్ తో జూన్ 2 వస్తొన్న `డాక్టర్ సత్యమూర్తి`- నిర్మాత డి.వెంకటేష్
యశ్వంత్‌ మూవీస్‌ బ్యానర్‌పై తమిళంలో సూపర్ హిట్ అయిన 'ఒరుముకతరై' చిత్రాన్ని తెలుగులో 'డాక్టర్‌ సత్యమూర్తి' గా అనువదించి జూన్ 2 తెలుగులో విడుదల...
powered by RelatedPosts