అమ్మడు తిండి ఖర్చురోజుకి 35 వేలా?

0

Samantha2అంతలా తినేసే ఆ లేడీ బకాసురాలు ఎవరా అని ఆశ్చర్యపోతున్నారా? పేరు చెబితే ఇంకా ఆశ్చర్యపోతారు? ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు, అక్షరాల అందాల సమంత . బక్క చిక్కిన భామకి తిండి ఖర్చు తగ్గాలి కానీ, అంతలా పెరగడం ఏమిటి అని మళ్లీ ఆశ్చర్యపోయారా? అయితే ఇది చదవండి మరి.

వినడానికి విడ్డూరంగా ఉండొచ్చు… బోల్డంత ఆశ్చర్యంగా కూడా ఉండొచ్చు. ఎందుకంటే.. సమంత రోజువారీ ఆహారం ఖర్చు 35వేలట. వామ్మో 35వేలా? అనుకుంటున్నారా? సమంత ఇంత ఖర్చుపెట్టడానికి కారణం ఉందట. గతంలో తనకు స్కిన్ అలర్జీ వచ్చిన విషయం తెలిసిందే. దానివల్లే మణిరత్నం ‘కడలి’ సినిమా వదులుకుంది. ఆ సినిమా పరాజయంపాలైంది కాబట్టి, సమంతకు పెద్దగా నష్టం జరగలేదనుకోండి. కానీ, ఆ సమయంలో సమంతను ఆ స్కిన్ అలర్జీ బాగానే బాధపెట్టిందట. విదేశాల్లో చికిత్స చేయించుకుని, ఎలాగోలా ఆ అలర్జీ నుంచి బయటపడింది సమంత. అంతా బాగానే ఉందనుకుంటున్న పమయంలో అలర్జీ తిరగబెట్టిందని సమాచారం. అప్పట్నుంచి సమంత ఆహార నియమాలు కూడా మారిపోయానని పరిశీలకులు అంటున్నారు. డాక్టర్లు చెప్పిన డైట్ నే ఫాలో అవుతోందట. షూటింగ్ లొకేషన్లో ప్రొడక్షన్ ఫుడ్ తినదట. మరి.. ఏం చేస్తుంది? అంటే..
ప్రత్యేకంగా వంటవాళ్లని నియమించుకుందట సమంత. తనతో పాటు వీళ్లు షూటింగ్ స్పాట్స్ కి వెళతారని వినికిడి. సమంత ఏది కోరితే అది వండి పెడతారట. ఉదయం నుంచి రాత్రి వరకు సమంత తీసుకునే ఆహారానికి 35వేలు ఖర్చవుతుందని తెలిసింది.

అన్ని వేలని స్వాహా చేయించే ఆ ఫుడ్ ఏమిటో చెబితే ఒకసారి తెల్సుకోవాలని ఉంది పాప …. చెప్పరాదూ… నోరు విప్పరాదూ?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts