అమ్మడు ఆ సినిమానుండి ఔట్…!!

0

Sruthi Hasan Cute Look (11)అసలే పూటకో హీరోయిన్ దిగుమతి అవుతున్న కోలీవుడ్ లో అవకాశాలు రావడమే గగనమైపోతున్న తరుణంలో, ఒక పెద్ద ప్రొడక్షన్ కంపెనీ నుండి అవకాశం వచ్చాక దాన్ని వదులుకుంటే వారిని ఏమనాలి? శ్రుతి హాసన్ అనాలి. ఎందుకు అంటారా? ఇదిగో మీరే చదవండి.
విషయానికొస్తే, తమిళంలో విశాల్‌కు జంటగా పూజైరూ. చిత్రంలో నటిస్తోంది శ్రుతిహాసన్. దీంతోపాటు తెలుగు, హిందీ చిత్రాల్లోకూడా కొన్ని సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది. ఇది ఇలావుండగా విజయ్ నటిస్తున్న కొత్త చిత్రం ఒకదానికి దర్శకుడు శింబుదేవన్ డెరైక్ట్ చేస్తున్నారు. ఇందులో నటి శ్రుతిహాసన్ ఒప్పుకుంది. దీని గురించి గత వారం తన ఇంటర్నెట్ పేజీలో విజయ్, శింబుదేవన్ చిత్రంలో నటించేందుకు అగ్రిమెంట్ కూడా అయిపోయింది అని శ్రుతి ప్రకటించింది కూడా..

మరి ఇంతలోనే ఏమైందో కానీ, శ్రుతిహాసన్ మళ్లీ తాను విడుదల చేసిన ప్రకటనలో కొన్ని మార్పులు జరిగాయని, భారీ చిత్రం ప్రస్తుతం లేదని అంది. హిందీలో వెల్‌కం బ్యాక్‌రూ. చిత్రంలో జాన్ అబ్రహాం, అనిల్ కపూర్‌తోను, రమణ రీమేక్ అయిన కబార్‌రూ. చిత్రంలోను నటిస్తోంది శ్రుతి. ఈ రెండు చిత్రాలు 80 శాతం పూర్తయ్యాయి. అదలా ఉండగా, శ్రుతి వదిలేసుకున్న భారీ చిత్రం, విజయ్ చిత్రమేనని చిత్ర వర్గాలు తెలుపుతున్నాయి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts