అమ్మడున్నాక ఈమె ఎగిరితే చూసేదెవరు?

0

Shilpi Sharma Hot (2)కుప్పలుతెప్పలుగా ట్యాలెంట్ ఉన్నా, ఇటీవలి కాలంలో సరైన హిట్ లేక సతమతమవుతున్న హీరో మంచి మనోజ్, తన గత చిత్రం ‘పోటుగాడు’ పొడిచిన పోటుకి తేరుకోలేక తన తదుపరి సినిమాపై కాసింత ఎక్కువ శ్రద్ధే పెడుతున్నట్టు కనిపిస్తోంది. అందుకే, అన్ని జాగ్రత్తలూ తీసుకుని మంచు మనోజ్ మొదలు పెట్టిన సినిమా ‘కరెంట్ తీగ’. మొన్నీ మధ్యే మొదలైన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుని అప్పుడే చివరి దశకు చేరుకుంది. ఇటీవలే ఈ మూవీలోని క్లైమాక్స్ ఎపిసోడ్ ని షూట్ చేసారు. ఈ ఎపిసోడ్ కోసం మంచు మనోజ్ రిస్కీ స్టంట్స్ కూడా చేసాడు.

ఇదిలా ఉండగా, తాజా సమాచారం ప్రకారం ‘గ్రీన్ సిగ్నల్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన శిల్పి శర్మ ‘కరెంట్ తీగ’లో ఓ ఐటెం సాంగ్ చేయనుంది. మొదటి సినిమాలోనే తన గ్లామర్ తో ఆకట్టుకున్న శిల్పి శర్మ ఈ స్పెషల్ సాంగ్ లో మాస్ ఆడియన్స్ కి తన గ్లామర్ ట్రీట్ ఇస్తుందని ఈ చిత్ర టీం అంటోంది. ఈ ఐటెం సాంగ్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు అదిరిపోయే మాస్ బీటున్న సాంగ్ ని కూడా కంపోజ్ చేసాడని సమాచారం.

మంచు మనోజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి జి. నాగేశ్వరరెడ్డి డైరెక్టర్. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ మూవీలో హాట్ బ్యూటీ సన్నీ లియోన్ అతిధి పాత్రలో కనిపించనుంది. త్వరలో ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. అలాగే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ఆడియో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

సన్నీ లియోన్, రకుల్ ప్రీత్ సింగ్, శిల్పి శర్మ లాంటి సుందరాంగులు మెరుస్తూంటే, దాన్ని కరెంట్ తీగ అనేకంటే “కరెంట్ తీగలు” అంటే ఇంకా బాగుంటుందేమో కదూ….??

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

స‌రిహ‌ద్దు సైనిక‌ల‌తో సూర్య వాలీబాల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయకుడిగా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో నా పేరు సూర్య చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిస...
అల్లు రామ‌లింగ‌య్య హోమియో కాలేజ్ కు మెగాస్టార్ కోటి రూపాయ‌లు విరాళం
మెగాస్టార్ చిరంజీవి చేసే సేవా కార్య‌క్ర‌మాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స‌హాయ‌మంటూ వెళ్లిన వారికి ఆయ‌న స‌హాయం ఎప్పుడూ అందుతూనే ఉంటుంది. తాజాగా ...
`అ` తెచ్చిన అద్భుత అవ‌కాశం
`అ` హిట్ తో రెజీనా కు మంచి గుర్తింపు ద‌క్కింది. అందులో అమ్మ‌డి మేకోవ‌ర్ అంద‌ర్నీ విస్మ‌యానికి గురిచేసింది. స‌క్సెస్ అందుకుంది. అందుకే అ మ‌రో అద్భ...
powered by RelatedPosts