అమ్మడి బ్యాగులో అవెందుకున్నాయ్?

0

deepika-padukone-011అదేంటో కానీ, బాలీవుడ్ హీరోయిన్స్ ఒక్కొక్కరికి ఒక్కో నమ్మకం ఉంటుంది. ఏ మాత్రం ఖాళీ లేకుండా చేతిలో ఎప్పుడు చూసిన సినిమాలు ఉండటానికి ఒక్కొక్కరూ ఎన్నెన్ని మొక్కులు మొక్కుతారని? ఇక తమ అందాన్ని కాపాడుకోవడంలో అయితే హీరోయిన్స్ ఎన్ని మార్గాలున్నాయో అన్నిటినీ ట్రై చేస్తూనే ఉంటారు. ఇదిలా ఉండగా..హీరోయిన్స్ ప్రేమ వ్యవహారాలు, సహజీవనాలు గురించి వార్తలు వ్రాసే బాలీవుడ్ మీడియా విచిత్రమైన దీపిక క్యాండిల్ సీక్రెట్ ను బయట పెట్టింది. ప్రస్తుతం బాలీవుడ్ ను గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా ఏలుతున్న దీపిక పదుకొనేకు ‘అరోమా ధేరపి’ క్యాండిల్స్ అంటే మహా మోజు.

మంచి సువాసనలను వెదజల్లే ఈ క్యాండిల్స్ వెలుగును తధేకంగా ఏ వ్యక్తి అయినా చూస్తే ఆ వ్యక్తి మనసుకు ప్రశాంతత కలగడమే కాకుండా ముఖంలో మంచి ఆకర్షణ ఏర్పడుతుందని ఈ ‘అరోమా ధెరపీ’ క్యాండిల్స్ ను ప్రమోట్ చేసే కంపెనీలు చెపుతూ ఉంటాయి. ఈ మాటలు బాగా నచ్చిన దీపిక ప్రస్తుతం తాను ఎక్కడికి వెళ్ళినా తన వెంట ఈ క్యాండిల్స్ కట్టలను తీసుకు వెళుతోందట.

అంతేకాదు ఆమె హ్యాండ్ బ్యాగ్ లో కూడ ఈ క్యాండిల్స్ కనిపిస్తూ ఉండటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఆఖరికి షూటింగ్ స్పాట్ దగ్గర దీపిక రెస్ట్ తీసుకునే వ్యానిటీ వ్యాన్ లో కూడ ఈ క్యాండిల్స్ పెట్టుకుని షూటింగ్ బ్రేక్ మధ్య వ్యాన్ లోని లైట్స్ అన్నీ ఆర్పివేసి ఈ కొవ్వొత్తుల సుఘంధ పరిమళాన్ని ఆస్వాదిస్తూ తన అందమైన ముఖ కాంతిని ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది అంటూ బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది.

ఏమిటో పిచ్చి నమ్మకాలు అనుకునే వారూ లేకపోలేదు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

స‌రిహ‌ద్దు సైనిక‌ల‌తో సూర్య వాలీబాల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయకుడిగా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో నా పేరు సూర్య చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిస...
అల్లు రామ‌లింగ‌య్య హోమియో కాలేజ్ కు మెగాస్టార్ కోటి రూపాయ‌లు విరాళం
మెగాస్టార్ చిరంజీవి చేసే సేవా కార్య‌క్ర‌మాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స‌హాయ‌మంటూ వెళ్లిన వారికి ఆయ‌న స‌హాయం ఎప్పుడూ అందుతూనే ఉంటుంది. తాజాగా ...
`అ` తెచ్చిన అద్భుత అవ‌కాశం
`అ` హిట్ తో రెజీనా కు మంచి గుర్తింపు ద‌క్కింది. అందులో అమ్మ‌డి మేకోవ‌ర్ అంద‌ర్నీ విస్మ‌యానికి గురిచేసింది. స‌క్సెస్ అందుకుంది. అందుకే అ మ‌రో అద్భ...
powered by RelatedPosts