అమ్మడికి ఆంగ్లపత్రిక కౌంటర్

0

deepika_padukone_in_race_2-wideకొద్దిరోజుల క్రితం ప్రముఖ ఆంగ్ల దినపత్రిక టైంస్ ఆఫ్ ఇండియా కి చెందిన వెబ్‌సైట్ బాలీవుడ్ సెక్సీ క్వీన్ దీపిక పాడుకొనే వక్షోజాలా గురించి ఆసభ్యకరంగా ఒక ఆర్టికల్ ని పబ్లిష్ చేసిన సంగతి తెలిసిందే. దానిపట్ల తీవ్రంగా మండిపడుతూ , ఆ పత్రిక తాలూకు వ్యాసాన్ని ఎండగడుతూ దీపిక సంచలనమైన కామెంట్స్ చేయడం ఎంతటి దుమారానికి తెరతీసిందో మనం చూశాం. తాజాగా, దీపిక కామెంట్స్ కి టైమ్స్ ఆఫ్ ఇండియా యాజమాన్యం అంతే ధీటుగా స్పందించింది.

ముందుగా దీపిక పాయింట్ ఆఫ్ వ్యూ ఒకసారి చూద్దాం:

నా ప్రొఫెషన్ కు నేను కొత్తేమి కాదు. పాత్రలు డిమాండ్ మేరకు తాను నడుచుకుంటాను. ఒక్కోసారి పూర్తిగా దుస్తులు ధరించాల్సి రావోచ్చు. లేదా నగ్నంగా నటించాల్సి రావొచ్చు. అలాంటి పాత్రలు ధరించాలా వద్దా అనే విషయంపై తన ఇష్ట ప్రకారమే నిర్ణయం తీసుకుంటాను. అయితే పాఠకుల దృష్టిని ఆకర్షించేందుకు ఒక రకమైన సిద్దాంతాన్ని పెట్టుకుని నాసిరకమైన ఎత్తులతో మహిళ గౌరవాన్ని దిగజార్చడం పద్దతి కాదు. ఎన్నడైనా పురుషుడి, మహిళ శరీరంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారా.. షారుక్ 8 ప్యాక్ గురించి తప్పుడు పద్దతిలో కథనాన్ని ప్రచురించారా అంటూ తాజాగా దీపికా పదుకొనె ఫేస్ బుక్ లో ఓ వ్యాసాన్ని రాశారు. రీల్ లైఫ్ కు రియల్ లైఫ్ కు చాలా వ్యత్యాసం ఉంటుందని టైమ్స్ ఆఫ్ ఇండియా హెడ్ లైన్ కోట్ చేసింది. హెడ్ లైన్ ద్వారా అమ్ముకోవడానికి మహిళల వక్షోజాలను, పురుషాంగాలను, ఇతర శరీర భాగాలను ఎంపిక చేసుకోవడం సమర్ధనీయమా అంటూ ప్రశ్నించారు.

దానికి జవాబుగా ఫేస్ బుక్ లో టైమ్స్ ఆఫ్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ:

“మీ రీల్, రియల్ లైఫ్ వాదనను మేము అంగీకరిస్తున్నాం. చాలా రోజులుగా తెరమీద కాకుండా బయట కూడా అంగాంగ ప్రదర్శన చేస్తున్నారు. ప్రమోషన్ కార్యక్రమాల్లో డాన్యులు చేయడం, మ్యాగజైన్ కవర్ కు ఫోజులివ్వడం లాంటి కనిపిస్తున్నాయి.అక్కడ మీరు ఏలాంటి రోల్ లో నటిస్తున్నారు? ఎందుకు ఆ హిపోక్రసీ? ఇంతకు ముందు ఇతర మీడియా సంస్థలు మీ వక్షోజాలతో ఫోటోలు పోస్ట్ చేశారు. అప్పుడు అడ్డు చెప్పని మీరు.. ఇప్పుడే ఎందుకు రాద్దాంతం చేస్తున్నారు?” అంటూ ఫేస్ బుక్ లో టైమ్స్ ఆఫ్ ఇండియా కౌంటర్ ఇచ్చింది. సెక్సీ షారుక్ ఖాన్ 8 ప్యాక్ అంటూ హెడ్ లైన్ పెట్టలేం కదా అంటూ తన కథనంలో పేర్కొన్నారు. ఎవరి అభిప్రాయాలను చెప్పుకోవడానికి వారికి హక్కు ఉంటుంది? ఈ వివాదాన్ని కాస్త ముందుకు తీసుకువెళ్లి ఆకర్షణీయమైన హెడ్ లైన్ తో ప్రాముఖ్యం లేని హెడ్ లైన్ అమ్ముకోవడానికి ప్రయత్నిస్తాను. మీ ఇంటర్వ్యూలు ట్వీట్ చేయడం చూస్తున్నాం. అదీ మీ పబ్లిసిటీకి, మీ సినిమాల ప్రమోషన్ కు బాగా ఉపయోగపడ్డాయి. యూట్యూబ్ లో ఉన్న మీ వీడియోలపై ఎందుకు అభ్యంతరం చెప్పలేదు. అంతేకాకుండా మీకు సంబంధించిన అసభ్యకరమైన ఫోటోగ్రాఫులు మీడియాలో రావడంపై మా మీడియా మిత్రులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అని టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో వెల్లడించింది.

దీపిక ఇందుకు తిరిగి ఏమైన కౌంటర్ ఇస్తుందా లేదా అన్నది వేచి చూడాలి మరి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

తార‌క్ స‌ర‌స‌న పూజా హెగ్దే
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న సినిమా త్వ‌ర‌లో సెట్స్ కు వెళ్ల‌నున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇందులో హీరోయిన్ ...
రాజ‌మండ్రిలో స‌మంత రైడింగ్
సమంత స్కూటీపై షికార్లు చేసేస్తోంది. ఎంజాయ్‌ చేయడం కోసం కాదు లేండి. ఆమె నటిస్తున్న చిత్రంలోని ఓ సన్నివేశం కోసం. సమంత కథానాయికగా ‘యూ టర్న్‌’ తె...
`సంత‌`తొలి షెడ్యూల్ పూర్తి
సూర్య భరత్ చంద్ర ,శ్రావ్యా రావు జంటగా శ్రీ సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి నిర్మిస్తొన్న చిత్రం "సంత". మట్టి మనుషుల ప్రేమక...
powered by RelatedPosts