అమీర్ ని అలా చూసి పిల్లలు భయపడ్డారట

0

aamir-khanఎలా చూసి? అనే ప్రశ్న అనుక మీ మైండ్ లో వచ్సింది అంటే మాత్రం, మీరు ప్రపంచాన్ని సరిగ్గా ఫాలో కావట్లేదు అని అర్ధం. అమీర్‌ఖాన్ గత రెండు రోజులుగా వార్తల్లో ఎందుకు ప్రముఖంగా వినిపిస్తున్నాడు, కనిపిస్తున్నాడు అన్నది వార్తల్ని ఎప్పటికప్పుడు ఫాలో అయ్యవాళ్ళకి తెలుస్తుంది. తెలియని వాళ్లకోసం ఇదిగో …అసలు విషయం..

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్ రాజు హిరానీ దర్శకర్వంలో రూపొందుతున్న “పీకే” అనే చిత్రం కోసం పూర్తి నగ్నంగా పోజు ఇచ్చిన ఆ చిత్రం తాలూకు ఫర్స్ట్ లుక్ పోస్టర్ నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి అమీర్‌ఖాన్ చేసిన సాహసం నచ్చింది. ఎందరో అతన్ని మెచ్చుకున్నారు. చాలామందికి ఆ పోస్టర్ కళాత్మకంగా అనిపించింది కానీ, కాన్పూర్ కి చెందిన మనోజ్ కుమార్ అనే ఒక లాయర్ కి మాత్రం ఆ పోస్టరు అభ్యంతకరంగా ఉంది. అందుకే ఆయన, “ఆ పోస్టర్ పిల్లల మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎందరో భయపడుతున్నారు కూడా.,” అంటూ అబ్సెనిటి యాక్టు ప్రకారం అమీర్‌ఖాన్ మీద ఐపీసీ సెక్షన్ 292 కింద కేసు ఫైలు చేశాడు.

ఈ తాజా పరిణామం అమీర్‌ని తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని ప్రాధమిక సమాచారం. ఐతే, దీని పట్ల అమీర్ ఇంకా అధికారికంగా ఎక్కడ స్పందించలేదు. కాకపోతే, ఎలా స్పందిస్తాడో అన్న ఉత్సుకత మాత్రం చాలామందిలో ఉంది అన్నది మాత్రం నిజం. అమీర్ రియాక్షన్ చూడాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
అదరగొడుతున్న మాస్ మహారాజా రవితేజ "నేల టిక్కెట్టు" ట్రైలర్‌:
మాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడి ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, వెటకారపు డైలాగులు ఉంటాయి, మంచి ఎమోషన్...
'ఫ్రీ స్పోర్ట్స్ రిహాబ్ సెంటర్' కి మహేష్ బాబు చేయూత
6 సంవత్సరాలుగా స్లమ్ ప్రాంతాలలో రోజుకి 150 కి పైగా రోగులకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న ఎన్.జీ.ఓ కి మహేష్ బాబు తన సహాయ సహకారాలు అందిస్తున్నా...
powered by RelatedPosts