అమలాపాల్ కి భర్త షరతు

0

Amala-Paul-quit-after-marriageతమిళ దర్శకుడు ఎఎల్ విజయ్‌ను మనువాడిన అమలా పాల్ గురించి అందరికీ తెలిసిందే. పెళ్లికి తర్వాత నటించనను గొప్పలు చెప్పిన అమలాపాల్.. పెళ్లయ్యాక కూడా కొన్ని సినిమా చేసేందుకు ఆమె భర్తే కారణమని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇద్దరమ్మాయిలతో బన్నీ సరసన నటించిన అమలాపాల్.. తెలుగు, తమిళ భాషల్లో గ్లామర్ హీరోయిన్‌గా ముద్ర వేసుకుంది.

అయితే పెళ్లయ్యాక కూడా భార్య సంతకం చేసేసిన సినిమా కాల్షీట్లను సక్రమంగా పూర్తి చేసేందుకు విజయ్ కంకణం కట్టుకున్నారట. పెళ్లికి ముందు అమలాపాల్ సైన్ చేసేసిన సినిమాలను తప్పక పూర్తయ్యేలా చేస్తున్నాడట. హైకు అనే సినిమాలో అమలాపాల్ సంతకం చేసేసినా.. కాల్షీట్లను వేస్ట్ చేయకుండా.. నిర్మాతలకు, దర్శకులకు ఎలాంటి తలనొప్పి లేకుండా చేసేందుకు విజయ్ తగిన చర్యలు తీసుకుంటున్నాడని కోలీవుడ్ వర్గాల సమాచారం.

దర్శకుడు కావడంతోనే విజయ్ బాధ్యతగా వ్యవహరిస్తున్నాడని, తనలా మరో దర్శకుడు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే తన భార్య అయిన అమలాపాల్ సంతకం చేసేసిన సినిమాల్లో తప్పకుండా నటించాల్సిందేననే షరతు కూడా పెట్టేశాడని కోలీవుడ్ జనం కోడై కూస్తోంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts