అభిమానులకోసం బిగ్ బి"బచ్చన్ బోల్"

0

amitabh-bachchanమనిషి జీవితంలో రెండు ప్రధానమైనవి ఉంటాయి. ఒకటి విజ్ఞానం.. మరొకటి వినోదం. ఈ రెండు ఉంటేనే మనిషి పరిపూర్ణంగా ఎదగగలడు.
ఆ విషయం అమితాబ్ బచ్చన్‌కు బాగా తెలుసు. అందుకే, ఇన్నాళ్లూ తన ట్విట్టర్ ద్వారా బోల్డన్ని సరదా కబుర్లు పంచుకున్న అమితాబ్, ఇప్పుడు ఆలోచింపజేసే మాటలు, విజ్ఞానాన్ని పెంచే విషయాలు, చరిత్రకు సంబంధించిన నిజాలను పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, దీని కోసం వారంలో ఒక రోజును ప్రత్యేకంగా కేటాయించారు. ప్రతి బుధవారం తాను పంచుకునే విశేషాలకు సరదాగా ‘బచ్చన్ బోల్’ అని పేరు పెట్టుకున్నారు అమితాబ్. మొన్న మంగళవారం నాడు ‘రేపు బచ్చన్ బోల్‌లో ఆసక్తికరమైన విషయాలు చాలా చెబుతా’ అని సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన అమితాబ్ ఆ మాట నిలబెట్టుకున్నారు. ట్విట్టర్‌లో బచ్చన్ పొందుపరిచిన విశేషాల్లో కొన్ని ఈ
విధంగా…

– “జీవితంలో ఆచరించదగ్గ వాస్తవం ఒకటుంది. అదేంటంటే.. ఏదైనా సాధించాలనుకుంటే.. దాని మార్గాన్ని నువ్వే వెతుకు…ఎన్ని కష్టాలొచ్చినా నువ్వే సాధించు. అది ఇంటికి సంబంధించినదైనా.. ఆఫీసుకి సంబంధించినదైనా. నువ్వు సాధించాలనుకున్నది నీ పర్యవేక్షణలో జరిగితేనే వర్కవుట్ అవుతుంది.”

– “అందరూ ఏదో సందర్భంలో బాధపడతారు. కానీ, ఎవరైనా పక్కవారి బాధను అర్థం చేసుకుంటారా? చేసుకోరు గాక చేసుకోరు
మన మనసులోకి ఒక ఆలోచన రావడం సులభం. దాన్ని ఆచరణలో పెట్టాలనుకోవడం కూడా సులభమే. కానీ, ఆచరించి చూపడం మాత్రం ఎంతో కఠినం.”

– “ఆరువేల ఏళ్ల క్రితం సింధు నదిలో నౌకాయానం (నావిగేషన్) మొదలైంది. అసలు నావిగేషన్ అనే పదం ఎక్కణ్ణుంచి పుట్టిందో చాలామందికి తెలియకపోవచ్చు.. ‘నవ్‌గతి’ అనే సంస్కృత పదం నుంచి ఈ మాట పుట్టింది.” అంటూ ఎంతోమందికి తెలియని విషయాలు చెప్పి ఆకట్టుకున్న అమితాబ్ , మళ్లీ బుధవారం ఎప్పుడొస్తుందా, మళ్లీ కొత్త విషయాలు ఏమేం చెబుతారా అని ఆసక్తితో ఎదురుచూసేలా చేయడంలో సఫలం అయ్యారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Nela Ticket movie review
Nela Ticket Review: అమ్మ చేతి ముద్దపప్పు ఆవకాయ ఎంత బాగుంటుందో కదా. అమ్మ ప్రతి రొజూ అదే చేసినా ఆనందంగా తింటాం, ఎందుకు అంటే అది ముద్దపప్పు ఆవకాయ ...
‘ఆపరేషన్ 2019’ ట్రైలర్ లాంచ్
“గాంధీ కడుపున గాంధీ పుట్టడు, ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు, మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు.. ఎవరైనా సరే ప్రజల్లో నుంచే రావాలి వివిధ రూపా...
`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
powered by RelatedPosts