అన్నయ్య అమ్మడి మీద మోజుపడ్డాడా?

0
Chiranjeevi_150_film_heroine_tamannaఅన్నయ్య అనగానే ఎవరి గురించో వేరే చెప్పక్కర్లేదేమో? అన్నయ్య అంటే అప్పటికీ-ఇప్పటికీ – మరెప్పటికీ మెగాస్టార్ చిరంజీవి ఒక్కడే అని అందరికీ తెలిసిందే. దాదాపు ముప్పయ్యేళ్ళకి పైగా నట చరిత్రలో చిరు ఎపుడూ ఫలానా హీరోయిన్ తో చేయాలని ఉంది అని చెప్పింది లేదు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి నోరు తెరిచి ఒక హీరోయిన్ పక్కన నటిస్తే బాగుంటుంది అని చెబితే దానికంటే పెద్ద న్యూస్ మరొకటి ఉందా? ఇప్పటికీ చిరు తన 150 వ సినిమా ప్రకటిస్తే, టాప్ హీరోయిన్స్ అంతా క్యూలో నిలుచుంటారు అనడంలో ఎంతమాత్రమూ అతిశయోక్తి లేదు. అలాంటిది ఈ టాప్ హీరో నుండి కోరని వరం అందుకున్న ఆ అదృష్టవంతురాలు ఎవరు అని తెలుసుకోవాలని ఉందా? ఇదిగో మీరే చదవండి మరి.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు హోస్ట్ చేస్తున్న “సౌందర్యలహరి” కార్యక్రమంలో గతవారం నుండి చిరంజీవి గెస్ట్ గా వస్తున్నాడు. ఆ స్పెషల్ ఎపిసోడ్ తాలూకు రెండవ భాం నిన్న ఈటీవీలో ప్రసారమయ్యింది. అందులో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా హాజరయింది.  మధ్యలో ఒక ప్రశ్నకి జవాబుగా తమన్నాతో నాకు నటించాలని ఉంది అని “రచ్చ” ఆడియో ఫంక్షన్‌లో చిరు చెప్పిన వీడియో ప్లే చేసి చిరంజీవిని ఆశ్చర్యపరిచారు రాఘవేంద్రరావు. ఆ సందర్భంగా, నాకు ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు …తమన్న ఒప్పుకుంటే నేను చేయడానికి రెడీ “అన్నాడు చిరంజీవి.
అంటే, అన్నయ్య సినిమాకి హీరోయిన్ ఫిక్స్ అయినట్టేనా?

 

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts