అదేంటి పాప వేదాంతం చెబుతోంది?

0

tamil-movies-sruthi-hasan-new-photoshoot02ఒక పక్కన చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నా, సూపర్‌స్టార్ మహేష్ బాబు పక్కన అవకాశం అనేసరికి కాదనలేక ‘ఆగడు’ సినిమాలో ‘జంక్షన్ లో’ అంటూ ఓ ఐటెం సాంగ్ చేసింది అందాల శ్రుతి హాసన్. ఆ పాటకి ఇండస్ట్రీలో పెద్దగా గుర్తింపు రాలేదు. బయట ప్రేక్షకుల్లో కూడా మిశ్రమ స్పందన వచ్చింది. కట్ చేస్తే, శ్రుతి ప్రస్తుతం వేదాంత ధోరణిలో ట్వీట్లు పెడుతోంది.

”నా చుట్టూ ఉన్న ప్రపంచం ఎంతో మారిపోతున్నట్లు అనిపిస్తోంది. దీన్నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నాకు విలువల గురించి నేర్పిన వాళ్లందరికీ చాలా కృతజ్ఞతతో ఉంటాను” అని ట్వీట్ చేసింది. అంతకుముందు కూడా అందం ఉంటే చాలదు.. తెలివితేటలు కూడా ఉండాలి” అన్నది అమ్మడి తాజా ట్వీట్ సారాంశం.

కథానాయికగానే కాదు, సినిమాకు సంబంధించి ఏ చిన్న పాత్రలో కనిపించినా అది ప్రేక్షకులు గుర్తుండిపోయేలా ఉండాలి. చేసే పని పట్ల భక్తి, శ్రద్ధలుంటేనే జీవితంలో పైకొస్తాం అని చెప్పింది. కథానాయికలకు అందంతోపాటు తెలివితేటలు కూడా ఉండాలని, అవి లేనప్పుడు ఎంత అందం ఉన్నా వ్యర్ధమేనని తెలిపింది. ప్రస్తుతం విశాల్‌ హీరోగా హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పూజ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. ఈ నెల 24న స్విట్జర్లాండ్‌ వెళ్తోంది. అది కూడా పూజ సినిమాలో ఓ పాట కోసమేనట.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
అదరగొడుతున్న మాస్ మహారాజా రవితేజ "నేల టిక్కెట్టు" ట్రైలర్‌:
మాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడి ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, వెటకారపు డైలాగులు ఉంటాయి, మంచి ఎమోషన్...
'ఫ్రీ స్పోర్ట్స్ రిహాబ్ సెంటర్' కి మహేష్ బాబు చేయూత
6 సంవత్సరాలుగా స్లమ్ ప్రాంతాలలో రోజుకి 150 కి పైగా రోగులకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న ఎన్.జీ.ఓ కి మహేష్ బాబు తన సహాయ సహకారాలు అందిస్తున్నా...
powered by RelatedPosts