అది మారుతి "మార్క్" సినిమా అంట

0

imagesగురువింద గింజ తన నలుపుని ఎరుగదు అన్నట్టు, బూతు చిత్రాల దర్శకుడు “మారుతి” కి తన మీద ఉన్న “మార్క్” గురించి తెలుసో లేదో కానీ, నాకంటూ ఒక “మార్క్” ఉంది అని జబ్బలు చరుచుకుంటూ చెప్పుకోవడం ఎంతైనా కాస్త అతిశయోక్తి తో కూడుకున్న వ్యవహారమే…. కచ్చితంగా హాస్యాస్పదమే. తను తాజాగా నిర్మించిన “కాయ్ రాజా కాయ్” అనే సినిమా గురించి మారుతి మీడియాతో మాట్లాడుతూ ” సినిమా అంటే ఓ మార్క్ పడిపోయింది. కానీ, నా గత చిత్రాల తరహాలో కాకుండా సరికొత్త పంథాలో ఈ సినిమా ఉంటుంది. షూటింగ్ పూర్తయ్యింది. జేబీ మంచి స్వరాలిచ్చారు. త్వరలో పాటలను, వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు.

శివగణేశ్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ మారుతి టాకీస్, ఫుల్‌మూన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘కాయ్ రాజా కాయ్’. ఈ సినిమా ప్రచార చిత్రాలను సోమవారం సుమంత్ అశ్విన్ ఆవిష్కరించి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందజేశారు. శివగణేశ్ మాట్లాడుతూ -‘‘కాయ్ రాజా కాయ్ ఆట ఆడిన కొందరు యువకుల జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? అనేదే ఈ చిత్రకథ. కుటుంబ సమేతంగా చూడదగ్గ విధంగా ఉంటుంది’’ అని చెప్పారు. రామ్ ఖన్నా, మానస్, శ్రావ్య, షామిలి ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీనివాస్ అడ్డాల.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts