అగ్రహీరోల్లో శ్రీనివాస్ ఒకడవుతాడు : వెంకటేశ్

0

Alludu Seenu Movie Audio  (5) ‘‘మా నాన్న నన్ను పరిచయం చేసినప్పుడు నాకెలా అనిపించిందో.. ఈ రోజు బెల్లంకొండ శ్రీనివాస్‌కి అలాగే అనిపించి ఉంటుంది. తను భవిష్యత్తులో కచ్చితంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అగ్ర హీరోల్లో ఒకడవుతాడు. వి.వి.వినాయక్ ఈ సినిమా చేయడం అభినందనీయం’’ అని వెంకటేశ్ అన్నారు. బెల్లంకొండ శ్రీనివాస్‌ని హీరోగా పరిచయం చేస్తూ.. వి.వి.వినాయక్ దర్శకత్వంలో, బెల్లంకొండ సురేశ్ నిర్మిస్తున్న చిత్రం ‘అల్లుడు శీను’. దేవిశ్రీప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఆదివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. వెంకటేశ్ పాటలను, ఎస్.ఎస్. రాజమౌళి, బ్రహ్మానందం ప్రచార చిత్రాలను విడుదల చేశారు.

వినాయక్ మాట్లాడుతూ- ‘‘నా తొలి సినిమా ‘ఆది’ విడుదలైనపుడు మా నాన్న ఎంత ఆనందపడ్డారో.. రేపు ఈ సినిమా రిలీజైన తర్వాత బెల్లంకొండ సురేశ్ అంత ఆనందపడతారు. శ్రీనివాస్ గొప్పగా నటించాడు. ఎంతో స్టార్‌డమ్ ఉన్నప్పుటికీ కథానాయిక నటించిన సమంతకు, అడగ్గానే ప్రత్యేక గీతంలో నర్తించిన తమన్నాకు కృతజ్ఞతలు’’ అన్నారు. అడగ్గానే సినిమా చేసిపెట్టిన వినాయక్‌కి తాము రుణపడిపోయామని బెల్లంకొండ సురేశ్ అన్నారు. ‘‘సొంత కొడుకుని హీరోగా పరిచయం చేస్తే ఎంత జాగ్రత్త తీసుకుంటారో, అంత జాగ్రత్తను ఈ సినిమాకు వినాయక్ తీసుకున్నారని బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పారు. దిల్‌రాజు, దశరథ్, మెహర్మ్రేశ్, జెమినీ కిరణ్ తదితరలు పాల్గొన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts