అందుకే ముంబై వెళ్లాను!

0

Ileanaగత రెండేళ్లుగా తెలుగు పరిశ్రమకు దూరంగా వుంటోన్న ఇలియానా బాలీవుడ్‌లో అదష్టాన్ని పరీక్షించుకుంటోంది. అక్కడ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. తెలుగులో అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్‌కు వెళ్లాననే వార్తల్లో వాస్తవం లేదని, తెలుగు పరిశ్రమ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని చెబుతోంది ఇలియానా. నాకు ఎలాంటి భాషాబేధాల్లేవు. నాకు తొలి అవకాశాన్నిచ్చింది తెలుగు పరిశ్రమే. ఇక్కడి ప్రేక్షకులతో నాకు విడదీయలేని అనబంధముంది. తెలుగు సినిమాల ద్వారానే నేనేమిటో అందరికీ తెలిసింది. ఇక్కడ సంపాదించుకున్న గుర్తింపుతోనే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగలిగాను. అవకాశాలులేక నేను తెలుగు సినిమాకు దూరం కాలేదు. జాతీయస్థాయిలో గుర్తింపు వున్న హిందీ చిత్రసీమలో కూడా నా ప్రతిభను నిరూపించుకోవాలనుకున్నాను. అందుకే ముంబైకి షిఫ్ట్ అయ్యాను. బాలీవుడ్‌లో ఏ స్థాయికి ఎదిగినా తెలుగుపరిశ్రమను ఎన్నటికీ మరచిపోను. హైదరాబాద్‌లో నాకు ఎంతో మంది శ్రేయోభిలాషులున్నారు. తెలుగులో మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. ఈ ఏడాది తప్పకుండా ఓ తెలుగు సినిమా చేస్తాను అని చెప్పింది ఇలియానా. ప్రస్తుతం ఈ సుందరి హిందీలో హ్యాపీ ఎండింగ్ అనే చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts