అందరూ క్రికెటర్లే అయిపోతే ఎలా?

0

ranbir-kapoor-latest-stills-2c0dca7bభారతదేశంలో ఏ క్రీడ ఎక్కువగా పాపులర్ అంటే, ఎలిమెంటరీ పిల్లాడిని అడిగినా తడుముకోకుండా “క్రికెట్” అని చెబుతాడు. అంతలా, క్రికెట్ భారతదేశంలో ఒక మతం లా తయారాయింది. కానీ మన జాతీయ క్రీడ హాకీ. అలాగే ఫుట్‌బాల్ లోకూడా భారతదేశానికి కూడా వరల్డ్ కప్ లో పాల్గొనే సామర్ధ్యం ఉన్న జట్టు ఉంది అనే విషయం నేటికీ తెలియదు. ఇకపోతే, క్రీడలకి – సినిమా లకి ఉన్న అనుబందం ఈనాటిది కాదు.
ఇకపోతే అసలు విషయం ఏమనగా….

చక్కటి క్రీడారంగంతో బాలీవుడ్ అనుబంధం అనేక విధాలుగా లాభదాయకమని ఇండియన్ సూపర్‌లీగ్ (ఐఎస్‌ఎల్) లోని ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌లో వాటాదారుడైన రణ్‌బీర్ కపూర్ పేర్కొన్నాడు. ఐఎస్‌ఎల్‌లో రణ్‌బీర్ కపూర్‌తోపాటు జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్‌లు సహయజమానులు కాగా వరుణ్‌ధావన్ గోవా టీం రాయబారి. ‘ఇది అత్యంత గొప్ప విషయం. దేశంలో ప్రతి క్రీడను ప్రోత్సహించాల్సిందే. క్రికెట్‌కే తొలి ప్రాధాన్యం. అయితే దానర్థం కబడ్డీ, ఫుట్‌బాల్ వంటి ఆటలను వదిలేస్తామని కాదు. అంతేకాకుండా కబడ్డీ క్రీడాకారుడిగానో లేదా ఫుట్‌బాల్ క్రీడాకారుడిగానో యువతకు అవకాశమిచ్చినవాళ్లమవుతాం. ప్రతి ఒక్కరినీ క్రికెట్ ఆటగాడిగానే మలచాల్సిన పనిలేదు.

’అని ఇటీవల తన ఫుట్‌బాల్ క్లబ్‌ను ప్రారంభించిన రణ్‌బీర్ చెప్పాడు. అభిషేక్ నేతృత్వంలోని ప్రో కబడ్డీ లీగ్ ఫ్రాంచైసీ ఆదివారం రాత్రి జరిగిన ఆటలో విజయం సాధించింది. ఇక జాన్ అబ్రహం… నార్త్‌ఈస్ట్ యునెటైడ్ ఫుట్‌బాల్ క్లబ్ సహయజమాని. వరుణ్‌ధావన్ గోవా ఫుట్‌బాల్ క్లబ్‌కు రాయబారిగా వ్యవహరిస్తున్నాడు. ‘ఇండియన్ సూపర్‌లీగ్‌లో ప్రమేయం కలిగిన ప్రతి ఒక్కరూ దానిని మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలి. ఇందువల్ల మనదేశం తరఫున కూడా మంచి ఫుట్‌బాల్ టీం తయారవుతుంది’అని అన్నాడు. మంచి లీగ్‌ను తయారుచేసే దిశగా అడుగులు వేయాలన్నాడు. ఆసక్తికరమైన అంశమేమిటంటే వరల్డ్ కప్‌లో పాల్గొనేందుకు మన దేశానికి కూడా ఫుట్‌బాల్ టీం ఉందన్నాడు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts